చరణ్ దుమ్ము దులిపి... దంచి కొట్టాడు

రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం వచ్చే నెల 30 న విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ అంతా ఒక కొలిక్కి వచ్చేసింది. ప్రస్తుతం రంగస్థలం పోస్ట్ ప్రొడక్షన్ పనులకోసం రెడీగా ఉంది. అయితే చరణ్ ఇటు రంగస్థలం షూటింగ్ కంప్లీట్ కాకముందే... మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తో కలిసి మరో మూవీ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని రామ్ చరణ్ తో సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టడానికి బోయపాటి కాచుకుని కూర్చుకున్నాడు. మరి బోయపాటి - రామ్ చరణ్ కాంబో మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా... తమిళ హీరో ప్రశాంత్, హీరోయిన్ స్నేహ లు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.
మరి మొదటి షెడ్యూల్ లో రామ్ చరణ్ సీన్స్ లేకుండానే పూర్తి చేసిన బోయపాటి సెకండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ కి విలన్ వివేక్ ఒబెరాయ్ కి మధ్యన యాక్షన్ సన్నివేశాలను చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడు. మరి షూటింగ్ మొదలెట్టుకున్ని కొద్దీ రోజులు గడవక ముందే... ఈ సినిమాకి సంబందించిన హిందీ శాటిలైట్ రైట్స్ కు భారీ ధర పలికిందని చెబుతున్నారు. మరి ఒక తెలుగు సినిమాకి హిందీ శాటిలైట్ రైట్స్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోవడం అనేది ఒక రికార్డుగా చెబుతున్నారు. మరి చరణ్ - బోయపాటి సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ ఎంతనుకుంటున్నారు.
అక్షరాలా 22 కోట్ల ధర పలికింది. మరి ఈ రేంజ్ ధర ఇప్పటివరకు మరే ఇతర తెలుగు సినిమాకి రాలేదు. అయితే ఇంత ధర పలకడానికి ఒక విధంగా చరణ్ కారణమైతే... మరో విధంగా హీరోయిన్ కైరా అద్వానీ తో పాటు నటుడు వివేక్ ఒబెరాయ్ కారణమంటున్నారు. చరణ్ కెరీర్ ఆరంభంలోనే బాలీవుడ్ లో జంజీర్ అనే స్ట్రయిట్ హిందీ సినిమాలో నటించడం... అలాగే కైరా అద్వానీకి బాలీవుడ్ లో క్రేజ్ ఉండడం.... అలాగే బాలీవుడ్ హీరో వివేజ్ ఒబెరాయ్ ఈ సినిమా లో విలన్ గా నటించడం వంటి విషయాలలోనే ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ ఆ రేంజ్ లో అమ్ముడుపోయాయి అంటున్నారు.

