Wed Apr 01 2026 04:56:26 GMT+0530 (India Standard Time)
చరణ్, ఉపాసన అక్కడ?

నటుడు రామ్ చరణ్ తేజ దంపతులు ఈరోజు ఉదయం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో వీరు శ్రీవారిని దర్శించుకున్నాడు. ఆలయ అధికారులు రామ్ చరణ్ దంపతులకు తీర్ధ ప్రసాదాలు అందించారు. రామ్ చరణ్ తిరుపతికి వచ్చాడని తెలుసుకున్న ఆయన అభిమానులు , భక్తులు అతన్ని చూడ్డానికి ఎగబడ్డారు.
దర్శనం పూర్తైన అనంతరం 'దర్శనం బాగా జరిగింది.. తిరుపతి అందాలతో మైమరిచిపోయాను' అంటూ ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలిపింది. రామ్ చరణ్ తేజ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ కు జోడిగా సమంత నటిస్తుంది.
Next Story

