గాయత్రితో మళ్ళీ సందడి చెయ్యడానికి వచ్చేస్తున్నాడు!!

రెండేళ్ల క్రితం నుండి సినిమాల్లో నటించకుండా సైలెంట్ గా వున్న మోహన్ బాబు ఇప్పుడు మరోసారి వెండితెర మీద సందడి చెయ్యడానికి రెడీ అవుకున్నాడు. అల్లరి నరేష్ తో 'మామ మంచు అల్లుడు కంచు' చిత్రంలో నటించిన మోహన్ బాబు ఈ రెండేళ్ల నుండి ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే ఇప్పుడు మోహన్ బాబు 'గాయత్రి' అనే చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేసి సెట్స్ మీదకెళ్ళాడు. మదన్ డైరెక్షన్ లో మోహన్ బాబు ఈ గాయత్రి చిత్రాన్ని శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్ర పూజ కార్యక్రమంలో మంచు ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నట్లు తెలుస్తుంది.
మోహన్ బాబు ముద్దుల మనవరాళ్లు.... విష్ణు మంచు పిల్లలు వివియానా, అరియనా అలాగే మంచు లక్ష్మి పాప విద్యానిర్వాణ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని సందడి చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ గాయత్రి చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

