గడుసుదే

రాజోలు పాప బాగా ముదిరింది. ఎప్పుడూ డీసెంట్ గా గ్లామర్ అంటే తెలియని అమాయకపు అమ్మాయిలా కనబడే అంజలి ఇప్పుడు గ్లామర్ గేట్లు తెరవడమే కాదు గడుసుగా సమాధానం కూడా చెబుతుంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ రాకపోయినా ఇప్పుడు మాత్రం గ్లామర్ రోల్స్ ని ఎక్సపెక్ట్ చెయ్యడమే కాదు.. ఎప్పుడూ బబ్లీగా కనబడే అంజలి గ్లామర్ రోల్స్ కోసమే అన్నట్టుగా బాగా స్లిమ్ అయ్యి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడు ట్రెడిషనల్ లుక్ లో ఉండే అంజలి ప్రస్తుతం గ్లామర్ లుక్ లోకి మారిపోయి సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యడమేకాదు... మ్యాగజైన్స్ కి ఫోటో షూట్స్ కూడా ఇచ్చేస్తుంది.
ఇప్పుడు తాజాగా అంజలి ఒక మ్యాగజైన్ కిచ్చిన ఫోటో షూట్ లో హాట్ గా కనబడడమే కాదు హాట్ సమాధానాలు చెప్పి ఔరా అనిపించింది. ఆ మ్యాగజైన్ ఇంటర్వ్యూ లో భాగముగా వారు హీరోతో ముద్దు సీన్లలో నటించేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అడగగా... దానికి అంజలి రొమాంటిక్ సన్నివేశాలు...ముద్దు సీన్స్ ని తెరకెక్కించేటప్పుడు ఒక్కోసారి సోలో క్లోజప్స్ షాట్స్ తీస్తుంటారు. ఆ టైమ్ లో ఎదురుగా హీరో కూడా ఉండడు.కేవలం ఎదురుగా కెమెరా మాత్రమే ఉంటుంది. కానీ హీరో గారికి ముద్దు పెడుతున్నట్టు రొమాంటిక్ గా నటించాల్సి ఉంటుంది.
మరి ఆ టైమ్ లో అలాంటి సీన్స్ లో నటించడం అంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఎదురుగా హీరో ఉంటే ముద్దుసీన్లు బ్రహ్మాండంగా పండుతాయి. కానీ హీరో లేకుండా ఇలా సోలోగా ముద్దుపెట్టమంటే నాకు నచ్చదు... అని ఘాటైన హాట్ సమాధానం చెప్పి అంజలి పాప గడుసుదే... అనిపించింది

