ఖాన్స్ కథని కొట్టేసిన ఎన్టీఆర్, చరణ్

బాహుబలి తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తున్నాడో అనేది ఒకే ఒక పిక్ తో చెప్పకనే చెప్పేసాడు. ఏదో ప్రేమ కథ తీస్తాడని ఒకసారి.. కాదు కాదు చిన్న హీరోతో గ్రాఫిక్స్ లేని సినిమా చేస్తాడనే న్యూస్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో కలిసున్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాహుబలి తర్వాత తన సినిమా ఏమిటనేది చెప్పకనే చెప్పాడు. కాకపోతే జనాలను కన్ఫ్యూజ్ కూడా బాగానే చేసాడు. ఎందుకంటే క్లారిటీ లేకుండా ఒక్క పిక్ తోనే సమాధానం చెప్పేసాను అనుకున్నాడు రాజమౌళి. కానీ జనాలు మాత్రం ఏవేవో ఊహించేసుకుని అనేక ఊహాగానాలు తెరపైకి తెచ్చేసారు.
ఇకపోతే రాజమౌళి ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో ఖచ్చితంగా సినిమా చెయ్యబోతున్నాడు. అది అలాంటి ఇలాంటి సినిమాకాదు. బాహుబలిని తలదన్నేరీతిలో సినిమా చెయ్యబోతున్నాడు. అలాగే ఈ సినిమాకి బడ్జెట్ కూడా 150 కోట్ల పైమాటే అన్నట్టుగా ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతుంది. అలాగే ఈసినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత సెట్స్ మీదకెళుతుందంటున్నారు. అలాగే రాజమౌళి తండ్రి ఆధ్వర్యంలో కథ కూడా రెడీగా అవుతుందని.. రాజమౌళి అప్పుడే స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్నాడంటున్నారు. అయితే విజయేంద్రప్రసాద్ ఈ స్టోరీ ని ఎన్టీఆర్ - రామ్ చరణ్ కోసం అనుకోలేదట.
విజయేంద్ర ప్రసాద్ బాలీవడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన భజరంగి భాయీజాన్ కి కథ అందించి.. ఆ సినిమాతో ఎనలేని కీర్తి ప్రతిష్టలు అందుకున్నాడు. అందుకే విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు కూడా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ - షారుఖ్ ఖాన్ లతో ఒక మల్టీస్టారర్ కోసం ఈ కథని తయారు చేసుకున్నాడట. ఇక ఈ మల్టీస్టారర్ లో నటించే స్టార్ హీరోలు అన్నదమ్ములుగా కనబడతారట. అయితే విజయేంద్ర ప్రసాద్ రాసుకున్న కథతో రాజమౌళి ని దర్శకుడిగా బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇప్పిద్దామని విజయేంద్ర అనుకుంటే... రాజమౌళి మాత్రం మల్లి టాలీవుడ్ లో సత్తా చాటాలని డిసైడ్ అయ్యి బాలీవుడ్ ఖాన్స్ కోసం రాసిన ఈ మల్టీస్టారర్ కథని తెలుగులో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కోసం లాక్ చేసాడట. ఇక జక్కన్నతో సినిమా అంటే.. అటు చరణ్ ఇటు ఎన్టీఆర్ ఎప్పుడూ రెడీనే. అందుకే రాజమౌళి మల్టీస్టారర్ కి ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సోషల్ మీడియాలో బీభత్సమైన ప్రచారం జరుగుతుంది.

