క్లాస్ దర్శకుడితో... క్లాస్ హీరో?

సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ప్రస్తుతం ఉన్న రోజుల్లో తమకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. మాస్ దర్శకుల మాటెలాగున్నా క్లాస్ సినిమాలు తీసే దర్శకులకి మరీ కష్టం. ఇక టాలీవుడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ముల మాత్రం పక్కా క్లాస్ సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక క్లాస్ మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా శేఖర్ కమ్ముల 'ఫిదా' అనే క్లాస్ సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ మూవీ పై ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఫిదా సినిమా విడుదలై మూడు నెలలు గడుస్తున్నా శేఖర్ కమ్ముల తాన్ నెక్స్ట్ సినిమా గురించి ఎటువంటి ఆలోచన చేస్తున్నాడో అనే దానిపై రకరకాల ఊహాగానాల మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి.
ఇదంతా ఇలా ఉంటె తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల రీసెంట్ గా హీరో నాని కి ఒక కథని వినిపించాడనే టాక్ వినబడుతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి శేఖర్ కమ్ముల చెప్పిన స్టోరీ లైన్ నచ్చి డెవలప్ చేయమని శేఖర్ కమ్ములకి చెప్పాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాని కూడా శేఖర్ కమ్ములతో 'ఫిదా' సినిమాని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజే ప్రొడ్యూస్ చేయనున్నాడట. ఇక నాని - శేఖర్ కమ్ముల - దిల్ రాజు కలయికలో సినిమా వస్తుంది అనగానే అందరిలోనూ ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణం లో నాని చేస్తున్న 'ఎంసిఎ' సినిమా డిసెంబర్ లో క్రిష్ట్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి ఈ మూవీతో పాటు నాని మేర్లపాక గాంధీ దర్శకత్వం లో వస్తున్న కృష్ణార్జున యుద్ధం తో కూడా బిజీ గా ఉన్నాడు. మరోపక్క కిషోర్ తిరుమలతో నాని సినిమా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. మరి ఈసినిమాల మధ్యలో శేఖర్ తో సినిమా ఎప్పుడు చేస్తాడో నాని.. అనేది తెలియాల్సి ఉంది.

