Fri Dec 26 2025 02:38:10 GMT+0000 (Coordinated Universal Time)
కౌంటర్లు సిద్ధం చేసుకుంటున్న బోయపాటి శ్రీను

దర్శకుడిగా పరిచయ చిత్రం ఐన భద్ర చిత్రం నుంచి ఇటీవలి ఘన విజయం సరైనోడు వరకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అరడజను చిత్రాలలో ఐదు చిత్రాలు విజయ శిఖరాన్ని అందుకున్నాయి. అంతటి సక్సెస్ రేట్ తో పరిశ్రమలో తిరుగులేకుండా దూసుకుపోతున్న బోయపాటి శ్రీను కి పరిశ్రమ వ్యక్తులు, ఆయనకు చేయూతనిచ్చిన శ్రేయోభిలాషుల నుంచే తీవ్ర ఆరోపణలు ఎదురు అయ్యాయి. ఆ పరిశ్రమ వ్యక్తులే నటుడు దర్శక రచయిత పోసాని క్రిష్ణ మురళి, దర్శక రచయిత కొరటాల శివ. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు ఇచ్చిన వేరు వేరు ఇంటర్వ్యూ లలో వారి అంతర్గతాన్ని ఆవిష్కరించే భాగంగా బోయపాటి శ్రీను గురుంచి తెలియని దుర్మార్గపు కోణం అంటూ నిప్పులు చెరిగారు.
అయితే ఇప్పటి వరకు ఈ ఆరోపణలకు స్పందించని బోయపాటి శ్రీను త్వరలో రాబోతున్న లెజెండ్ చిత్ర 1000 రోజుల వేడుకను వేదికగా చేసుకుని ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రొద్దుటూరు లో జరగబోయే ఈ వేడుకలో ఈ అంశాలపై మాట్లాడటానికి సందర్భం కాకపోయినా బోయపాటి మాట్లాడతాడా? పోసాని క్రిష్ణ మురళి వంటి నిజాయితీపరుడైన వ్యక్తికి ఎదురు వెళ్లి పోసాని చెప్పింది అంతా అబద్దం అని బోయపాటి వాదిస్తే ప్రేక్షకులు నమ్మే పరిస్థితి కూడా లేదు అని ముక్త కంఠ అభిప్రాయం వినిపిస్తుంది.
పోసాని ఆరోపణలతో పాటు సింహ చిత్రానికి టైటిల్ కార్డు గుర్తింపు ఇవ్వకుండా మోసం చేసారు అని వాపోయిన కొరటాల శివ కి సంజాయిషీ ఇస్తాడో లేక ప్రతి సవాల్ విసురుతాడో చూడాలి.
Next Story

