Sun Mar 22 2026 23:27:20 GMT+0530 (India Standard Time)
కోన వెంకట్ మరీ ఘోరం - శ్రీ రెడ్డి

శ్రీ రెడ్డి తాజాగా ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ పై సంచలన ఆరోపణలు చేశారు. కోన వెంకట్ తనను బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 వెనకాల శ్మశానం దగ్గర వున్న గెస్ట్ హవుస్ కి పిలిచాడని చెప్పారు. దర్శకుడు వి.వి.వినాయక్ అక్కడికి వస్తారని తనని నాకు పరిచయం చేస్తానని చెప్పారని చెప్పారు. తీరా అక్కడకి వెళ్ళాక కోన వెంకట్ ఒక్కరే వున్నారని, తనకు మద్యం ఆఫర్ చేశారని, తర్వాత తనను శారీరకంగా బలవంతం చేశాడని చెప్పారు.
ఇదిలా వుండగా, శ్రీ రెడ్డి ఆరోపణలపై కోన వెంకట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక నటి తనతో పాటూ చాలమంది సినీ పెద్దలపై నిరాధార ఆరోపణలు చేస్తోందనీ, ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించి నిజానిజాలను వెలికి తీయాలని, తను త్వరలో లీగల్ గా ముందుకు వెళతానని ట్వీట్ చేశారు.
Next Story

