కేసుని హుష్ కాకి చేసేలా ఉన్నాడే

మలయాళ నటి భావన పై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్ ను కేసు నుండి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులై 10న అరెస్ట్ అయిన దిలీప్ 80 రోజుల జైల్లో ఉండి.. అక్టోబర్ 3న షరతులతో కూడిన బెయిల్ తో విడుదలయ్యాడు. కాగా ఇప్పుడు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన సిట్ ఛార్జ్ షీట్ ను సమర్పించాడనికి సిద్ధంగా ఉంది. ఈ ఛార్జ్ షీట్ లో దిలీప్ ను 8 వ నిందితుడిగా పేర్కొన్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 17న నటి భావన పై కొందరు లైంగిక దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి పల్సర్ సుని, విజీష్ లను అరెస్ట్ చేశారు. లైంగికదాడి అనంతరం వీరిద్దరికి ఆశ్రయం కల్పించిన చార్లీని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలో చార్లీ.. దిలీప్ కూడా ఈ దాడిలో పాల్గొన్నారని.. పల్సర్ సుని , విజీష్ లు తన వద్దకు వచ్చినప్పుడు భావన పై చేసిన దాడికి సంబందించిన వీడియో ను సైతం చూపించారని తెలిపాడు చార్లీ.
తాజాగా ఇప్పుడు దిలీప్ ను 8 వ నిందితుడిగా చేర్చడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు భావన తరుపు న్యాయవాదులు. త్వరలోనే దిలీప్ ఈ కేసు నుండి తప్పించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.దిలీప్ ను నిందితుడిగా చెబుతూ వాంగ్మూలం ఇచ్చిన చార్లీ కూడా ప్రస్తుతం దిలీప్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ 164 ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు తెలిసింది. దాంతో దిలీప్ తన పలుకుబడిని ఉపయోగించి చార్లీ ని తనకు అనుకూలంగా మార్చాడేమో అని కొందరు ఆరోపిస్తున్నారు.

