కేవలం ప్రభాస్ ఓకే అంటే చాలు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ పేరే చెబుతారు. ఎందుకంటే ప్రభాస్ వయసు అంతుంటుంది మరి. 38 వచ్చేసినా ఇంకా పెళ్లి పేరెత్తకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్న ప్రభాస్ కి ఈ ఏడాది పెళ్లి జరుగుతుందని అభిమానులు ఎదురు చూసారు. ఎందుకంటే బాహుబలి సీరీస్ పూర్తవడంతోనే.. ప్రభాస్ పెళ్లి ఖాయమనే మాటలు వినబడ్డాయి. అసలు ప్రభాస్ పెళ్లి గురించి ఎలాంటి విషయమైనా.. అభిమానులందరికీ ఓ విశేషమే. ప్రభాస్ పెళ్లిపై ఎప్పటికప్పుడు అనేక రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ప్రభాస్ ఫ్యామిలీ.. ముఖ్యంగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ఇప్పటికే.. నలుగురు ఐదుగురు అమ్మాయిలను ప్రభాస్ కోసం ఫైనల్ చేశామని.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చెప్పారు. ఆ అమ్మాయిలలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేస్తామని.. కాకపోతే కేవలం ప్రభాస్ ఆమోదం మాత్రం మిగిలి ఉందని ఆయన చెబుతున్నారు. అమ్మాయిని ఫైనల్ చేసి.. పెళ్లికి ప్రభాస్ ఓకే అంటే.. అంగరంగవైభవంగా పెళ్లి చేసేందుకు తాము కూడా ఎదురుచూస్తున్నట్టు ఆయన చెప్పారు. మరి ప్రభాస్ మాత్రం ప్రస్తుతం తనకి సినిమాలే ఇంపార్టెంట్ అన్నట్టుగా బాహుబలి తర్వాత ఒక రెండు నెలలు గ్యాప్ తీసుకుని మళ్ళీ సుజిత్ దర్శకత్వంలో సాహో కోసం రెడీ అయ్యాడు.
అందుకే ఇటు ప్రభాస్ మాత్రం పెళ్లి ఊసెత్తకుండా.. సాహో సినిమా షూటింగ్ లో బిజీ గా గడుపుతున్నాడు. ఇప్పటికే.. తన పెళ్లికి ఇంకా టైమ్ ఉందని చెప్పిన ప్రభాస్.. ఆ టైమ్ ఎంత అన్నది కూడా చెబితే ఈ కన్ ఫ్యూజన్ ఉండదు కదా అని అంటున్నారు.

