కుర్ర హీరోలు నాని ని అందుకోవడమా?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఇచ్చే పారితోషకంతో ఒక మీడియం బడ్జెట్ సినిమా తీసెయ్యొచ్చు నిర్మాతలు. మరి స్టార్ హీరోలకు ఉండే రేంజ్ అలాంటిదే. ఒక్క సినిమా హిట్ అయితే స్టార్ హీరో పారితోషకం అమాంతంగా పెరిగిపోతుంది. అలాగే సినిమాల ప్లాప్ అయినా వారి పారితోషం మాత్రం తగ్గదు. తెలుగు సినిమాపరిశ్రమలో స్టార్ హీరోలైతే ఒక్కో సినిమాకి 15 నుండి 20 కోట్లు పారితోషకం అందుకుంటున్నారు. కానీ ఒకే ఒక్క యంగ్ హీరో మాత్రం ఈ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఏడాదికి మూడు సినిమాలు విడుదల చేస్తూ ఒక్క స్టార్ హీరో ఒక్క సినిమాకి అందుకున్న పారితోషకాన్ని.... ఏడాదిలో మూడు సినిమాలు విడుదల చేస్తూ మూడు సినిమాలకు కలిపి స్టార్ హీరో ఒక్క సినిమాకి తీసుకునే పారితోషకాన్ని అందుకుంటున్నాడు.
అతనెవరో కాదు నేచురల్ స్టార్ నాని. నాని ఈ ఏడాది నేను లోకల్, నిన్ను కోరి హిట్స్ తో దూసుకుపోతూ ఇప్పుడు తాజాగా MCA సినిమాని డిసెంబర్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. నాని భలేభలే మగాడివోయ్ హిట్ దగ్గరనుండి ఒక్కో సినిమాకి 6 కోట్ల పారితోషకం అందుకుంటూ... సినిమా సినిమాకి రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఆ లెక్కన ఈ ఏడాది నాని దాదాపు 18 కోట్ల పారితోషకం అందుకుని స్టార్ హీరోలకు చుక్కలు చూపించాడు. సింపుల్ గా మీడియం బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ హిట్స్ కొట్టుకుంటూ పోతున్న నాని బాక్సాఫీసు వద్ద మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఇక వరుస హిట్స్ తో నాని కి మరింత డిమాండ్ పెరిగింది. మీడియం బడ్జెట్ నాని మీద పెడితే సినిమా విజయం సాధించి కాసులు కురిపిస్తుందని... ఇప్పుడు నిర్మాతలంతా ఫిక్స్ అయ్యారు. అందుకే ఇప్పుడు నాని కూడా తన పారితోషకాన్ని పెంచేసాడనే టాక్ వినబడుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక్కో సినిమాకి ఆరు కోట్లు అందుకుంటున్న నాని మరో కోటి యాడ్ చేసి 7 కోట్లు కావాలని అడుగుతున్నది. మరి ఒక్కో సినిమాకి 7 కోట్లు అంటే... ఏడాదికి మూడు సినిమాలు చొప్పున 21 కోట్లన్నమాట. మరి స్టార్ హీరోలతో పోటీగా నాని ఒక్కో ఏడాదికి ఇంత పెద్దమొత్తం సంపాదిస్తున్నాడన్నమాట. ఈ లెక్కన నాని రేంజ్ ని అందుకోవడానికి కుర్ర హీరోలైతే చాలానే కష్టపడాలన్నమాట

