కీర్తి పని అయిపోయిందోచ్

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కతున్న PSPK 25 టైటిల్ లోగోని ఈ రోజు సోమవారం నవంబర్ 27 న విడుదల చేశారు. దీనితో పవన్ ఫాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పక్కన ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఒకరు ట్రెడిషన్ కి పెట్టింది పేరైన కీర్తి సురేష్, మరొకరు హాట్ గర్ల్ అను ఇమ్మాన్యువల్. వీరిద్దరూ పవన్ కళ్యాణ్ పక్కన మొదటిసారి నటిస్తున్నారు. ఈ సినిమాతో వీరిద్దరూ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి అవలీలగా చేరిపోతారేమో కూడా.
అయితే ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసి తన పని కాస్త అవ్వజేసానంటుంది. PSPK25 లో కీర్తికి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యిందనే విషయం డబ్బింగ్ చెప్పే చోట సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కీర్తి. మరి అందులో కీర్తి సురేష్ నవ్వుతూ సెల్ఫీ తీస్తే అందులో కీర్తి డబ్బింగ్ చెప్పే స్క్రీన్ మీద కీర్తి సురేష్ ఎప్పటిలాగే ట్రెడిషనల్ గా కనబడుతూ పవన్ కళ్యాణ్ పక్కన వుంది. మరి సినిమాలో ఆ సన్నివేశం ఎప్పుడు వస్తుందో గాని చూడడానికి మాత్రం చాలా బావుంది.
ఇకపోతే కీర్తి సురేష్ తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి. అదే విషయం ఆమె పెట్టిన ఫొటోతోపాటే టాగ్ చేసింది.మరి ఈ భారీ ప్రాజెక్ట్ తో కీర్తి సురేష్ తెలుగు డబ్బింగ్ చెప్పేసి కంప్లీట్ యాక్టర్ గా మారిపోయిందన్నమాట. ఇక అమ్మడుకి ఏ విషయంలోనూ తిరుగుండదులే. ఇకపోతే పవన్ - కీర్తి సురేష్, అను ల PSPK 25 జనవరి 10 న సంక్రాతి కానుకగా విడుదలవుతుంది.

