కీర్తికి ప్రయారిటీ ఎక్కువిస్తే ఊరుకుంటానా?

హీరోయిన్ కీర్తి సురేష్ హవా అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను మాములుగా లేదు. రెండు భాషల్లోనూ నెంబర్ వన్ హీరోయిన్ గా కీర్తి దూసుకుపోతుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాల్లో మొదటి, మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకుని.. రెండో హీరోయిన్స్ గా వేరేవాళ్లని తీసుకుంటూ.. కీర్తి ఇమేజ్ ని మరింత పెంచుతున్నారు దర్శకనిర్మాతలు. హోమ్లీ, క్యూట్ హీరోయిన్ గా కీర్తి చేతినిండా సినిమాల్తో బాగా బిజీగా వుంది. అయితే ఇప్పుడు కీర్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఒక హీరోయిన్ ఒక పెద్ద ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె ఎవరో కాదు ఒకప్పటి టాప్ హీరోయిన్ త్రిష.
త్రిష ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ.. ఇప్పుడు పెద్ద స్టార్స్ పక్కన అవకాశాలు లేక లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో బిజీగా వుంది. అయితే తమిళంలో హరి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సామీ 2 నుండి త్రిష ఉన్నట్లుండి బయటికి వచ్చేసింది. అప్పట్లో కారణాలేమీ తెలియరాలేదు. అయితే త్రిష మీద నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసింది సామి 2 చిత్ర బృందం. ఇక తర్వాత కోలీవుడ్ నుండి త్రిషని రెండేళ్లు బ్యాన్ చేసే అవకాశముందని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ త్రిష మాత్రం తనకున్న బిజీ షెడ్యూల్స్ వలెనే ఆ ప్రాజెక్ట్ నుండి బయటికొచ్చానని చెప్పింది.
కానీ ఇప్పుడు ఇన్నాళ్ళకి త్రిష ఆ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకుందో అనేది క్లారిటీ ఇచ్చింది. సామి 2 లో విక్రమ్ సరసన కీర్తి సురేష్, త్రిష హీరోయిన్స్ కాగా.. ఆ సినిమాలో కీర్తి సురేష్ పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండడం తన పాత్రకి ఇంపార్టెన్స్ తక్కువ ఉండడంతో.. తాను బయటికి వచ్చేశానని చెబుతుంది. కీర్తి సురేష్ కి ప్రయారిటీ ఎక్కువిస్తే ఊరుకుంటానా అంటున్న త్రిష ఆ సినిమా షూటింగ్ లో ఒక్క సీన్ లో కూడా పాల్గొనలేదట. అందుకే వెంటనే ఆ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యానని.. తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇచ్చేస్తానని ఇండికేషన్స్ ఇచ్చింది త్రిష.

