కళ్యాణ్ రామ్ స్నేహితురాలి ఆవేశం

అనేక లఘు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుని, వెండి తెర పై కూడా తన అభినయాన్ని ప్రదర్శిస్తున్న శ్రావ్య రెడ్డి సామాజిక మాంద్యాలలో నిత్యం ప్రేక్షకులకు అందుబాటులో వుంటూ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో సంపన్నుల నుంచి సామాన్యుల వరకు అందరిని కుదిపేసిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ప్రజలలో నెలకొన్న అపోహల తొలగించటానికి ఈ పరిణామంపై తనకి వున్నా జ్ఞానాన్ని తన ఫాలోయర్స్ తో పంచుకోవటానికి తన పేస్ బుక్ లో లైవ్ చాట్లో ముచ్చటించటానికి పూనుకుంది శ్రావ్య రెడ్డి. తాను చెప్పిన సమయానికి తన ఫాలోయర్స్ తో ముచ్చటించటం ప్రారంభించింది.
పేస్ బుక్ లో తన ఫాలోయర్స్ లో వున్న ఒక వ్యక్తి చర్చ మధ్యలో శ్రావ్య రెడ్డి ని తన శరీర భాగాల కొలతలు అడగగా శ్రావ్య రెడ్డి తన సహనాన్ని కోల్పోయింది. అతగాడిపై విరుచుకుపడింది. "జరుగుతున్న చర్చ దేని మీద? నువు అడుగుతున్న ప్రశ్న దేని గురించి? నేను కూడా చర్చ నుంచి బైటకి వచ్చి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తాను. నువ్వు సమాధానం తెలుసుకున్న తరువాత వచ్చి నా శరీర భాగాలని తాకే ధైర్యం చెయ్యగలవా? నీలాంటి వారి వలెనే దేశంలో అనేక సాంకేతిక విషయాలు ప్రజల ప్రయోజనాలకు నోచుకోలేకపోతున్నాయి." అని ధీటుగా స్పందిస్తుండగా, మిగిలిన ఫాలోయర్స్ శ్రావ్య రెడ్డి ని శాంత పరిచారు. తరువాత కూడా 20 నిమిషాల పాటు లైవ్ చాట్ కొనసాగించింది శ్రావ్య రెడ్డి.
ఇటీవల విడుదల ఐన ఇజమ్ చిత్రంలో కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ స్నేహితురాలిగా కనిపించింది శ్రావ్య రెడ్డి.

