కమెడియన్ హీరో.. హీరో సంగీతం

ఒక తమిళ సినిమాలో ఒక గమ్మతైనా విషయం వెలుగులోకొచ్చింది. అదేమిటంటే అక్కడ ఒక సినిమాలో ఒక కమెడియన్ హీరో అయ్యాడు. కమెడియన్ హీరో గా నటించిన సినిమా కోసం మరో హీరో.. సంగీత దర్శకుడిగా మారాడు. తమిళ్ లో.. కమెడియన్ గా మంచి డిమాండ్ ఉన్న సంతానం ఇప్పుడు హీరోగా మారాడు. జీఎల్ సేతురామన్ దర్శకత్వంలో వైభవి హీరోయిన్ గా 'చక్క పోడు పోడు రాజా' అంటూ ఒక సినిమా పూర్తి చేశాడు. అయితే సంతానం హీరోగా నటించిన ఈ సినిమాకు.. మల్టీ టాలెంటెడ్ హీరో శింబు మ్యూజిక్ అందించాడు.
మరి శింబు మంచి సింగరే కాదు... ఇలా ఒక సినిమాకి సంగీతం కూడా అందించాడంటే మాత్రం గొప్ప విషయమే. ఇక శింబు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ సాధించింది. ఈ నెల 22న విడుదలకు సిద్ధమవుతోంది. వివేక్, వీటీవీ గణేష్, రోబో శంకర్ లాంటి టాప్ కమెడియన్లు నటించిన ఈ సినిమా.. పక్కా 200 శాతం కమర్షియల్ అంశాలతో.. సూపర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీశామని.. కచ్చితంగా అందరికి నచ్చేస్తుందని సంతానం చెప్పాడు.
అలాగే తన షూటింగ్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే శింబు.. తన సినిమాకు ఎంతో చెమటోడ్చి సంగీతం ఇచ్చారని... తన కోసం శింబు లాంటి హీరో వర్క్ చేయడం ఆనందంగా ఉందనీ సంతానం చెబుతున్నాడు.

