కత్రినా అందాల విందు

బాలీవుడ్ లో కత్రినా కైఫ్ ని హీరోయిన్ అనే కంటే అదిరిపోయే ఐటెం భామ అంటే బావుంటుందేమో. ఎందుకంటే కత్రినా కైఫ్ కి బాలీవుడ్ లో హీరోయిన్ కంటే ఐటెం భామగానే మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ టాప్ మూవీస్ లో ఐటెం సాంగ్స్ లో చిందులేసి అదరహో అనిపించినా కత్రినా మరోపక్క రణబీర్ కపూర్ తో ఉన్న ప్రేమ వ్యవహారంతో కూడా ఎప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉండేది. వారు ప్రేమలో ఉన్నప్పుడు ఎంత హైలెట్ అయ్యారో... చివరికి బ్రేకప్ తర్వాత కూడా కత్రినా, రణబీర్ కపూర్ల జంట అంతే హైలెట్ అయ్యింది. సినిమాల్లోని అందాలతోనే కాకుండా బయట కూడా మెరిసిపోయే కత్రినా కైఫ్ ఇప్పుడొక ఎర్ర ఎర్రమందారం లాంటి ఫోజులతో హీటెక్కిస్తోంది.
ఫోటో షూట్స్ తో అందాల ఆరబోతతో ఎప్పటికప్పుడు చెలరేగిపోయే కత్రినా ఇప్పుడు కూడా హార్పర్స్ బజార్ బ్రైడ్ మ్యాగజైన్ కోసం సూపర్ స్పెషల్ ఫోటో షూట్ లో మెరిసింది. ఎప్పటికప్పుడు మోడ్రెన్ అందాలతో రెచ్చిపోయే కత్రినా కైఫ్ ఇప్పుడు ఇలా బ్రైడల్ వేర్ డ్రెస్ లో అదిరిపోయే అందాలతో ఆ మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చేసింది. ఎర్ర మందారంలా.. రెడ్ కలర్ డ్రెస్సుతో కనబడి కనబడని అందాలతో... మత్తెక్కించే చూపులతో... ముక్కుకు ముక్కుపుడక, వేలుకి స్పెషల్ డిజైన్ రింగ్ తో, నుదిటిపీమీద బొట్టుతో అందానికే అసూయ పుడుతుందా అనే రేంజ్ లో కనబడుతుంది.
ఇక పైన చెప్పిన కత్రినా అందాలకు సరిపడా ఆ ఫోటో పైన హార్పర్స్ బజార్ బ్రైడ్ మ్యాగజైన్ వారు హీట్ పెంచుతున్న కత్రినా కైఫ్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టేసారు. మరి కత్రినా ఒక్క చూపుతో కొన్ని కోట్లమంది కుర్రాళ్ళ గుండెల్లో కొలువైపోతుందా అనిపిస్తుంది.


