ఒక్క సినిమాతోనే బోలెడు అవకాశాలు ఎక్సపెక్ట్ చేస్తుంది!!

'ముకుందా, ఒక లైలా కోసం' సినిమాల్లో చాలా సాంప్రదాయంగా నటించిన పూజ హెగ్డే 'డీజే దువ్వాడ జగన్నాథం' లో మాత్రం చాలా మోడరన్ అమ్మాయిలా గ్లామర్ ఒలకబోసింది. ఈ చిత్రంలో చిన్న చిన్న నిక్కర్లతో రెచ్చిపోయిన పూజ హెగ్డే సినిమాలో ఒక చోట బికినీతో రెచ్చగొట్టింది. ఆ బికినీ డ్రెస్ లో పూజ హెగ్డే ని చూసిన ఎవ్వరైనా తమ సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి వెనుకంజ వెయ్యరు. సినిమాలో పూజ వేసిన స్విమ్ సూట్ సీన్ లో సెన్సార్ వాళ్ళు కాస్త బ్లర్ చేసి చూపించినా కూడా ఆమె చేసిన బికినీ షో మాత్రం కుర్రకారు మతులు పోగెట్టేసిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఇక 'డీజే' సినిమాలో పూజ పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయినా కూడా ఆమె అందాలతో బాగా ఆకట్టుకుంది. బన్నీతో డాన్స్ లు విషయంలో కూడా పూజ అదరగొట్టేసింది. ఒకపక్క అందాల ఆరబోతతో మరో వైపు అల్లు అర్జున్ తో డాన్సుల విషయంలో పోటీపడింది. మరి ఒక్కసారిగా ఇలా అందాల ఆరబోతకు పూజ దిగింది అంటే ఆమె ఏ రేంజ్ లో అవకాశాలు ఆశిస్తుందో అర్ధమైపోతుంది. అయినా పూజ చేతిలో ఇప్పుడు చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని చెబుతుంది. ఆ ప్రోజెక్టుల వివరాలు అతిత్వరలోనే మీడియాకి వివరిస్తానని చెబుతుంది. మరి పూజ ఈ గ్లామర్ షో ఫలించి ఆమెకు బోలెడు అవకాశాలు రావాలని ఆశిద్దాం.

