ఒకే వేదికపై బాలీవుడ్ సిస్టర్స్

బాలీవుడ్ లో తమ అందచందాలతో తమకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న అందాల సోదరీమణులు కరిష్మా కపూర్, కరీనా కపూర్లు. వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనున్నారని సమాచారం. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. సరైన స్క్రిప్ట్ ఉంటే కచ్చితంగా నటిస్తామని గతంలోనే చెప్పారు. అయితే వీరి ఫ్యాన్స్ కు మాత్రం వీరిద్దరి ఒకే వేదికపై చూసే భాగ్యం దక్కనుంది.
వచ్చే నెల మహిళల దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో ఒక్కే వేదికపై పాల్గొననున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమంలో కపూర్ కుటుంబం నుండి రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తొలి అమ్మాయిగా తన అనుభవాలను పంచుకోనుంది కరిష్మా కపూర్.
అలానే తన ప్రొఫెషనల్ లైఫ్‌ని, వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా బ్యాలెన్స్‌గా నడిపిస్తున్నదీ కరీనా చెప్పనుంది. ఇలా ఒకే వేదికపై సిస్టర్స్ ను ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

