ఒకే ఒక్క ఫోటో.. ఎన్నో అనుమానాలు

రామ్ చరణ్ - శర్వానంద్ - సందీప్ వంగా, యూవీ క్రియేషన్స్ విక్కీ ఇలా అందరూ కలిసి ఒకే ఒక్క ఫొటోలో మెరిస్తే... అదే ఇక్కడ జరిగింది. రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల రూపొందించిన క్రిస్మస్ ట్రీ దగ్గర వీరంతా కలిసి ఒక ఫోటోకి ఫోజిచ్చారు. అయితే ఈ నలుగురు కలిసి ఒకే ఫ్రెమ్ లో కనబడంతో అనేక రకాల అనుమానాలతో సినిమా ఇండస్ట్రీలోని జనాలు కొట్టుకుపోతున్నారు. అసలు శర్వానంద్, రామ్ చరణ్ లు మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ సందీప్ వంగా, యువి క్రియేషన్స్ వారితో వీరికేం పని?.
అర్జున్ రెడ్డి హిట్ తో సందీప్ వంగా ఒక్కసారిగా లైమ్ టైమ్ లోకి వచ్చేసాడు. ఆ సినిమా తర్వాత సందీప్ వంగా ఏ హీరోకి కమిట్ అవ్వలేదు. ముందు శర్వానంద్ తో సినిమా అన్నప్పటికీ శర్వా మాత్రం ఇప్పుడు హను రాఘవపూడి, సుధీర్ వర్మ సినిమాల్తో బిజీగా వున్నాడు. మరి ఒకపక్క రామ్ చరణ్ కూడా రంగస్థలం, బోయపాటి సినిమాల్తో పాటే రాజమౌళి మల్టీస్టారర్ సినిమాతోనూ అస్సలు ఖాళీ లేడు. మరి వీరంతా కలిసి ఇలా ఒకే ఫోటోకి ఫోజివ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అందులో భాగంగానే సందీప్ వంగా దర్శకత్వంలో శర్వానంద్, రామ్ చరణ్ కలిసి ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని చేయబోతున్నారా?
వీరి కలయికలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుందా? ఎందుకంటే సందీప్ వంగకి అర్జున్ రెడ్డి హిట్ తర్వాత రామ్ చరణ్ తో అయినా, అల్లు అర్జున్ తో అయినా సినిమా చేయాలనుంది అనే కోరికను ఎప్పుడో బయటపెట్టడమే కాదు... రామ్ చరణ్ చుట్టూనే తిరుగుతున్నాడు. అందులో భాగంగానే శర్వా తో, రామ్ చరణ్ తో సందీప్ వంగా స్టోరీ డిస్కర్షన్స్ లో పాల్గొంటున్నాడని.. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువి క్రియేషన్స్ వారు నిర్మాతలు అనే ప్రచారం మొదలైంది. మరోపక్క యువి క్రియేషన్స్ వారు రంగస్థలం నైజాం హక్కులు దక్కించుకున్నారనే మాట కూడా వినబడుతుంది. మరి ఒకే ఒక్క ఫొటోతో ఎన్నో అనుమానాలను పుట్టించిన ఈ ఫోటో కథా కమిషు ఏమిటనేది మాత్రం కరెక్ట్ గా ఎవరికీ తెలియదు.

