ఐష్ లా తయారవుతుంది అనుకుంటే....?

బాలీవుడ్ లో అమితమైన అందంతో అందరిని తనవైపు తిప్పుకుని... టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరిన మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ హీరో అభిషేక్ ని పెళ్ళిచేసుకుని సెటిల్ అయ్యింది. ఐశ్వర్య రాయ్ అందం ముందు ఎలాంటి హీరోయిన్, అసలు ఎలాంటి అమ్మాయి అయినా దిగడుపే అన్నట్లుగా ఉండేది. అయితే మళ్ళీ ఐష్ లాగా బాలీవుడ్ లో మరో అందాల రాసి తయారైంది. అచ్చం ఐష్ లాగా ఆమె కూడా బాలీవుడ్ ని ఏలుతుందని.. మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న ఊర్వశి రౌతెల్లని చూసి బాలీవుడ్ జనాలంతా ఫిక్స్ అయ్యారు.
అందాలపోత పోసి దివి నుండి భువికి దించారా అన్నట్టుగా ఆమె అందం, సౌందర్యం ఉంటుంది. అందానికి అందం, నవ్వుకి నవ్వు, హాట్ నెస్ కి హాట్ నెస్ ఇలా అన్నిటిలో ఊర్వశి రౌతేలా ముందుంటుంది. ఆమె మిస్ ఇండియా కిరీటాన్ని గెలిచినప్పుడు ఐశ్వర్య రాయ్ లా బాలీవడ్ ని ఎలెంతటి అందం ఆమెకుందనుకున్నారు. మరి ఊర్వశి కూడా ఎప్పటికప్పుడు గ్లామర్ షో చేస్తూ ఫ్యాషన్ షోస్ లోను, అవార్డ్స్ ఫంక్షన్స్ లోను అందమైన ఖరీదైన డ్రెస్ లతో మెరిసిపోతూ టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుందనే అనుకున్నారు. కానీ ఊర్వశి కి ఓ అనుకున్నంత బాలీవుడ్ ఆఫర్స్ మాత్రం రావడం లేదు. ఎంతగా గ్లామర్ షో చేసినా ఊర్వశి పరిస్థితిలో ఏ మార్పు లేదు.
ఎంతో ఆశలు పెట్టుకుని చేసిన హేట్ స్టోరీ4 లో ఊర్వశి అమితంగా అందాలు ఆరబోసిన ఆమెకు ఆ సినిమా గట్టి షాక్ ఇచ్చింది. ఆ సినిమాలో హద్దులు లేకుండా రెచ్చిపోయిన ఊర్వశికి బాలీవుడ్ ప్రియులు షాకిచ్చారు. సినిమాలో పస లేకపోవడంతో ఆ సినిమా ఫలితం కూడా అలానే వచ్చింది. మరి ఎంతగా బికినీ షో చేసి గ్లామర్ ఆరబోసిన అమ్మడుకి మాత్రం సరైన అవకాశం మాత్రం దొరకడం లేదు. చూద్దాం ఐష్ లాగ బిజీ అవుతుంది అనుకుంటే..ఈ అమ్మడు ఎక్కడికో వెళ్లిపోయేలాగే కనబడుతుంది.


