ఐశ్వర్య కు పెళ్లి షరతులు వర్తించవు

పాత రోజులలో లా పెళ్లి ఐన తర్వాత నటీమణులు రంగుల ప్రపంచాన్ని వదిలి పెట్టి వెళ్లట్లేదు. కొందరు పెళ్లి చేసుకుని బుల్లి తెరపై సత్తా చాటుతుంటే మరికొందరు వెండి తెరపైనే వయసుకి తగ్గ హుందా పాత్రలను పోషిస్తూ అభిమానుల చేత మెప్పు పొందుతున్నారు. బాలీవుడ్ లోనూ రాణి ముఖర్జీ, కరీనా కపూర్ ఖాన్ వంటి వారు ఎందరో వివాహం తర్వాత కూడా వెండి తెర పై ప్రత్యక్షమవుతున్న వారే. అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం చిత్ర పరిశ్రమ నుంచి కొంత కాలం విరామం తీసుకుని ఈ మధ్యే జజ్బా అనే చిత్రంతో ప్రేక్షకులకు పునర్దర్శనం కలిపించింది.
కాని ఆ చిత్రం ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే తాను కనిపించబోయే తదుపరి చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపొవాలి అనుకుందో ఏమో, ఎ దిల్ హై ముష్కిల్ చిత్రపు స్క్రిప్ట్ తన చేతికి వచ్చినప్పుడు తన పాత్ర బాగా సప్పగా ఉందని, కథానుసారం పాత్రలో కావాల్సిన శృంగార పాళ్ళు పెంచమని కరణ్ జోహార్ కు సూచనలు చేసి పంపింది అంట. ఆ సూచనల ఫలితమే మనం చూసిన ప్రచార చిత్రాల్లో ఐశ్వర్య పాత్ర తాలూకా చాయలు. చూసిన వాళ్ళు ఐశ్వర్య వివాహం కాకముందు కన్నా ఇప్పుడే అందంగా ఉందని కితాబు ఇస్తున్నారు.
నేటి తరం నాయికలకు పోటీ ఇవ్వటానికి వయసు ఆక్షేపం కాదు అని నిరూపించే రీతిలో ఎ దిల్ హై ముష్కిల్ లో కనిపించనుంది ఐశ్వర్య రాయ్. మరి ఈ చిత్రంతోనైన కమర్షియల్ సక్సెస్ చూస్తుందో లేదో మాజీ విశ్వ సుందరి

