ఏంటి ఈ సర్ప్రైజ్ లు

ఎన్టీఆర్ తాను నటిస్తున్న 'జై లవ కుశ' విషయంలో సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లిస్తున్నాడు. నిన్నటికి నిన్న గురువారమే సాయంత్రం 'లవ' టీజర్ తో కూల్ గా సింప్లి సూపర్ గా అదరగొట్టిన ఎన్టీఆర్ ఈ రోజు శుక్రవారం ఉదయం వినాయకచవితి శుభాకాంక్షలతో 'కుశ' ఫస్ట్ లుక్ తో వచ్చేసాడు. దీనితో 'జై లవ కుశ' లుక్స్ రివీల్ అయ్యాయి. ఎన్టీఆర్ నిజంగానే మూడు పాత్రలను మూడు విభిన్న రోల్సే చేస్తున్నాడు. 'జై' విలన్ గా ఆదరగొడుతుంటే... 'లవ' సాఫ్ట్ గా ఇరగదీస్తున్నాడు. మరి 'కుశ' కామెడీగా కనిపిస్తున్నాడు. అవునండి ఎన్టీఆర్ 'కుశ లుక్' లో హెయిర్ స్టయిల్ పెంచి పొడవాటి జుట్టుతో వెరైటీ గా కనబడుతున్నాడు.
మరి రెండు వెరియేషన్స్ ఉన్న 'కుశ' లుక్ ని వదిలారు చిత్ర యూనిట్ వాళ్ళు. ఒక 'కుశ' లుక్ కొంచెం సీరియస్ గా కనబడుతుంటే మరొక 'కుశ' లుక్ మాత్రం పార్టీ చేసుకుంటూ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. మరి 'కుశ' టీజర్ ని కూడా ఈ నెలాఖరనే విడుదల చేయనున్నారనే సమాచారం ఉండనే వుంది. ఇక ఇలా సడన్ గా ఫాన్స్ కి ఎన్టీఆర్ సర్ప్రైజ్ లు ఇవ్వడం చూస్తుంటే మాత్రం సినిమా విడుదల డేట్ లో ఎటువంటి అనుమానం లేదనుకోవచ్చు. సినిమా విడుదలకు టైం దగ్గర పడుతున్నకొద్దీ ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. సినిమా అనుకున్న టైం విడుదల వుంటుందో లేదో అనేది వారి టెన్షన్.
ఇక 'కుశ' లుక్ తోపాటు చిత్ర యూనిట్ హీరోయిన్స్ లుక్స్ కూడా రివీల్ చేస్తూ హడావిడి చేస్తుంది. 'కుశ' లుక్ తోపాటు 'జై లవ కుశ' హీరోయిన్ రాశి ఖన్నా లుక్ ని కూడా విడుదల చేసింది. రాశి ఖన్నా ఈ చిత్రంలో ప్రియా పాత్రలో మెరవనున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ నివేత థామస్ కూడా నటిస్తుంది. అంటే నివేత లుక్ బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇక ఎన్టీఆర్ ఇచ్చిన ఇన్ని సర్ప్రైజ్ లకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వినాయక చవితి పంగడతోపాటే ఈ 'జై లవ కుశ' పండగ కూడా చేసేసుకుంటున్నారన్నమాట