ఎన్నడూ లేని విధంగా

మెగా హీరోల మధ్య వార్ మొదలవుతుంది. ఫిబ్రవరి 9న ఇద్దరు మెగా హీరోస్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన వినాయక్ డైరెక్షన్ లో వస్తున్నా 'ఇంటెలిజెంట్' మూవీ...అలానే వరుణ్ తేజ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి.
మెగా ఫామిలీలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఇద్దరు మెగా హీరోస్ సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నాయి. మాములుగా సినిమాలు సమ్మర్..దసరా...పొంగల్ సీజన్స్ ను చూసుకుని ప్లాన్ చేసి మేకర్స్ రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు మెగా హీరోస్ సినిమాలు ఒకేసారి ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే.. మెగా హీరోస్ కి ఎవరి రేంజ్ వాళ్లకి వుంది. ఒక్కరు మాస్ సినిమాలు తీస్తే..మరొకరు ఫ్యామిలి, లవ్ స్టోరీస్, విభిన్నంగా కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ ఎవరి రూట్ లో వారు వెళ్తున్నారు. సో ఒకే రోజు రెండు సినిమాలు విడుదల ఐన ఎవరి స్టార్ డం వాళ్లకి వుంది కాబట్టి సినిమాల మీద ప్రభావం చూపే అవకాశం లేదు