ఎన్టీఆర్ హోస్టింగ్ అదిరిందంటున్న సీనియర్ హీరో!

నాగార్జున ఒక నటుడే కాదు... చాలా వ్యాపారాలకు అధిపతి కూడా. ఒక పక్క సినిమా ఇండస్ట్రీలో హీరోగా చేస్తూనే మరోపక్క అనేక వ్యాపారాలను నెలకొల్పి కింగ్ నాగార్జున గా వెలుగొందుతున్నాడు. ఇక హీరోగా... వ్యాపారవేత్తగా వెలుగొందుతూనే బుల్లితెర మీద మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. టివిలో మొదటిసారిగా హీరో హోస్ట్ చెయ్యడంలో మీలో ఎవరు కోటీశ్వరుడికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అసలు నాగార్జున ఆ ప్రోగ్రాంని రక్తి కట్టించిన తీరు అందరిని ఆకట్టుకుంది. అయితే అదే ప్రోగ్రాం ని ఆ తర్వాత చిరంజీవి కూడా హోస్ట్ చేసాడు.
సీనియర్ స్టార్స్ మాత్రమే బుల్లితెర మీద చూపిస్తే మేమేం తక్కువ తిన్నాం అంటూ.... ఇప్పుడున్న స్టార్ హీరోలు కూడా బుల్లితెర మీద తమ టాలెంట్ చూపిస్తున్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ అయితే స్టార్ మా లో బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. అలాగే హీరో రానా కూడా జెమిని ఛానల్ లో వచ్చే నెంబర్ వన్ యారీ తో అదరగొడుతున్నాడు. అలా యువ హీరోలు ఇలా తమ టాలెంట్ తో బుల్లితెర మీద దూసుకుపోతుంటే వీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రేక్షకులకు దగ్గరవడానికి బుల్లితెర అనేది అత్యుత్తమ మార్గం. అసలు నేను మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం చేయడానికి కారణం కూడా ఇదే అని చెప్పిన నాగ్... బిగ్ బాస్ ప్రోగ్రాంలో ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న తీరు అదిరిపోతోంది. ఈ షోకి ఎన్టీఆర్ హోస్టింగ్ చాల బావుంది అని చెబుతున్నాడు.
బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ మనందరికీ ఎలా కనపడుతున్నాడో రియల్ లైఫ్ లోను ఎన్టీఆర్ అలాగే ఉంటాడు. ఈ షోలో మనకు ఎన్టీఆర్ నిజ జీవిత పాత్రలా మన కళ్లముందు కనిపిస్తోంది... అంటూ ఎన్టీఆర్ ని నాగార్జున స్పెషల్ గా పొగిడేసాడు. ఎన్టీఆర్ ఈ బిగ్ బాస్ షోని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడని కూడా చెప్పాడు. మరి ఉన్నట్టుండి నాగ్, ఎన్టీఆర్ ని ఇంతిలా పొగిడేసాడంటే.... బిగ్ బాస్ ని హైప్ చేసే పనిలో భాగంగా చేశాడా? లేకుంటే నిజంగానే ఎన్టీఆర్ మీద ప్రశంసల జల్లు కురిపించాడా? అంటూ నెటిజెన్ట్లు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అయితే నాగ్ చెప్పినదాన్ని బట్టి ఎన్టీఆర్ రియల్ లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఆయన అభిమానులే కాకుండా ప్రేక్షకులంతా ఊహించుకుని ఆనందించే పనిలో ఉన్నారు.

