ఎన్టీఆర్ వైఫ్ గా ఆమె?

బాలకృష్ణ హీరోగా తేజ దర్శత్వంలో ఎన్టీఆర్ బయో పిక్ ని ఈ నెల 29 నుండి సెట్స్ మీదకెళ్లే ప్రయత్నాలు మొదలైపోయాయి. బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలతో పాటు, ఆసక్తిని నెలకొని ఉంది. తెలుగు రాష్ట్రంలో అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు లెక్కకు మించి ఉన్నాయి. బాలకృష్ణ ఈ సినిమాలో 66 పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ బయో పిక్ లో ఎన్టీఆర్ చిన్నప్పటినుండి, యుక్త వయసు, నట జీవితం, రాజకీయ జీవితం ఇలా ఎన్టీఆర్ బయో పిక్ లో ఉండబోతున్నాయి.
మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని స్వయంగా బాలకృష్ణే పోషిస్తున్నాడు. ఇకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ భార్య బసవతారకం కేరెక్టర్ కోసం కొంతమంది హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ పరిశీలనలో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ పేరు ఎక్కువగా వినబడుతున్న పేరు. మరి విద్యా బాలన్ ఇప్పటికే సిల్క్ స్మిత బయో పిక్ లో నటించి అదరగొట్టింది. ఇలాంటి బయో పిక్స్ లో విద్యా బాలన్ తన విశ్వరూపాన్ని చూపిస్తుందనడం లో ఎటువంటి సందేహం లేదు. నిజ జీవిత పాత్రలను అలా అలా అలవోకగా నటించి మెప్పించగల సామర్ధ్యమున్న హీరోయిన్ విద్యా బాలన్.
అందుకే డైరెక్టర్ తేజ... విద్యా బాలన్ పేరు బాలకృష్ణ దగ్గర ప్రస్తావించగా దానికి బాలకృష్ణ ఒప్పుకోవడం... తేజ ముంబై కి వెళ్లి విద్యా బాలన్ ని కలిసి ఎన్టీఆర్ వైఫ్ కేరెక్టర్ చెయ్యమని అడగడం.... దానికి విద్యా బాలన్ సానుకూలంగా స్పందించిందని వార్తలు వినబడుతున్నాయి. మరి విద్యా బాలన్ ఎన్టీఆర్ వైఫ్ కింద నటిస్తుందా లేదా అనేది మార్చ్ 29 తెలిసే అవకాశం ఉందంటున్నారు.

