ఎన్టీఆర్ లాగ గుర్తింపు వస్తుందా ?

రొటీన్ కథలు చేసి మన స్టార్ హీరోస్ కి బోర్ కొట్టిందేమో ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నారు మనవాళ్లు. కొత్తగా చేసారు అని మాట వింటే ఏ హీరోకైనా కొత్త ఉత్సాహాన్ని ఎనర్జీని ఇస్తుంది. మాములుగా చేసే పాత్రల కన్నా డిఫరెంట్ టైప్ క్యారెక్టర్ చేస్తే వచ్చే ఆ గుర్తింపేవేరు. కానీ ఇప్పుడు స్టార్ హీరోస్ కూడా వారి ఇమేజ్ ని పక్కన పెట్టి మారి కొత్తగా ట్రై చేస్తుండటం అభిమానులను ఆనంద పరుస్తోంది.
జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రలు వేసినా జై పాత్రకే పేరు వచ్చింది. ఎందుకంటె ఆ పాత్రలో ఎన్టీఆర్ కి నత్తి ఉండటంవలన. నత్తిగా మాట్లాడాల్సి రావడం సొంత తమ్ముళ్ల ప్రేమకే దూరమైపోయిన అన్న పాత్ర అది. నత్తిగా మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన యాక్షన్ అభిమానులను తెగ ఇంప్రెస్ చేసింది. అలానే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న రంగస్థలంలో చెవిటి వాడి పాత్ర చేస్తున్నాడు. సౌండ్ ఇంజినీర్ గా టీజర్ లో రామ్ చరణ్ యాక్షన్ అభిమానులను తెగ మెప్పించేసింది. మరి ఎన్టీఆర్ లాగ చరణ్ కి కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉందని టీజర్ చూస్తేనే మనకి అర్ధం అవుతుంది.
ఇలా వీళ్లు స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి కొత్త పాత్రలు చేయడం అభిమానులనే కాదు.. మొత్తం ప్రేక్షకులందరి ప్రశంసలు దక్కించు కుంటారు. వీరిద్దరూ ఇలా చేయటం వలన జక్కన్న తీస్తున్న మల్టీస్టారర్ కు మరింత మేలు చేస్తుండదనడంలో సందేహమే లేదు.

