ఎన్టీఆర్ రిఫర్ చేసింది ఈ హీరోయిన్ నే!

ఎన్టీఆర్ ప్రస్తుతం ఫామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు. సినిమా కూడా పర్లేదు అనిపించింది. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమాకు ప్రెపేర్డ్ గా వున్నాడు తారక్. త్రివిక్రమ్ చెప్పిన లుక్ కోసం తారక్ జిమ్ లో కుస్తీలు పడుతున్నాడు.
జనవరి చివరి వారంలో స్టార్ట్ కానుందా చిత్రం. ప్రస్తుతం త్రివిక్రమ్ మాత్రం పవన్ సినిమాలో బిజీగా ఉన్నాడు. అయినా కానీ ఎన్టీఆర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఎన్టీఆర్ ఓ నిర్ణయానికి వచ్చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఎన్టీఆర్.. కన్నడ భామ పూజా హెగ్డే ని రిఫర్ చేసాడని టాక్. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తుంది.
హీరోయిన్స్ సెలక్షన్ విషయంలో ఎన్టీఆర్ పూర్తి బాధ్యతలు డైరెక్టర్ త్రివిక్రమ్ కె ఇచ్చేశాడంట. క్యారెక్టర్ ప్రకారం హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలో తుది నిర్ణయం త్రివిక్రమ్ కే ఇచ్చాడట. ప్రస్తుతం లుక్ టెస్ట్స్, ఆడిషన్స్ లాంటివి చేసే తీరిక ఈ డైరెక్టర్ కు లేదు. సినిమా కూడా జనవరి చివరిలో స్టార్ట్ చేయాలి కాబట్టి..అంత టైం లేదు కాబట్టి అందుకే మొదట సినిమాను స్టార్ట్ చేసేసి.. ఆ తర్వాత హీరోయిన్ ను ఫైనల్ చేయాలని నిర్ణయించుకున్నారట. దీనికి ఎన్టీఆర్ కూడా ఒప్పేసుకున్నాడని టాక్

