ఎందుకు గుట్టుగా ఉంటున్నాడు!!

బాహుబలి విజయంతో అమెరికాకు ఎగిరిపోయి అక్కడే చాలా రోజులు సేదదీరిన ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సాహో కోసం ఫుల్ గా మేకోవర్ కూడా అయ్యాడు. ఇక యూఎస్ నుండి తిరిగొచ్చాక సాహో షూటింగ్ లో బాగా బిజీ అయ్యాడు ప్రభాస్. కాకపోతే ప్రభాస్ సాహో సెట్స్ లోకి ఇంకా వెళ్లాడా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ ప్రభాస్ సాహోలో షూటింగ్ లో జాయిన్ అయితే ఆ న్యూస్ సోషల్ మీడియాకు పాకిపోయేది. కానీ అలా జరగలేదు.
అయితే ప్రభాస్ సాహో కోసం షూటింగ్ లో పాల్గొంటున్నాడో లేదో తెలియదు గాని ఆయన పెళ్లి పనుల్లో ప్రభాస్ బిజీగా ఉన్నాడనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి 35 ఏళ్ళు వచ్చేసినా ఇంకా బ్యాచిలర్ లైఫ్ నే గడుపుతున్న ప్రభాస్ త్వరలోనే పెళ్లికోసం సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ప్రభాస్ కి అమ్మాయిని వెతికే పనిలో కృష్ణం రాజు ఫ్యామిలీ బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ పెళ్లి కోసం ప్రభాస్ కూడా రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతుంది. పెళ్లి విషయంలో ప్రభాస్ సీరియస్ గా దృష్టి పెట్టాడని, అందుకు సంబంధించిన పనుల్లోనే ఆయన వున్నాడనే టాక్ వినిపిస్తోంది.
మరి ఇది నిజమా కాదా అనేది మాత్రం క్లారిటీలేదుగాని ప్రభాస్ మాత్రం ప్రస్తుతానికి మీడియాకి చిక్కకుండా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నాడన్నది వాస్తవం.

