ఎందుకంత తొందర ?

లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ తెలుగు, తమిళ భాషలతోపాటు బాలీవుడ్ లో కూడా తన నటనతో పాటు సంగీత పరిజ్ఞానం తో కూడా మెప్పించి కొంత కాలం ప్రేక్షకులకి అభిమాన తారగా కొనసాగింది. కాకపోతే ఈ మధ్య కాలంలో నటన పై శ్రద్ద తగ్గించి పూర్తిగా మ్యూజిక్ ఆల్బమ్స్ పై దృష్టి పెట్టి వెండితెరకి దూరం అయిపోయింది శృతి హాసన్. 2018 పూర్తయ్యే లోపు రెండు నుంచి మూడు సొంత ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేయటానికి కృషి చేస్తోన్న శృతి హాసన్ తన 32 వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా స్నేహితుల మధ్య జరుపుకుంది.
ఎలానో నటన నుంచి బ్రేక్ తీసుకున్నారు, పైగా 32 వ యేట అడుగెడుతున్నారు కదా మరి పెళ్లి మాటేంటని ప్రశ్నించగా, "నేను పలానా వయసులో పెళ్లి చేసేసుకోవాలని అని నియమాలు ఏమి పెట్టుకోలేదు. మా ఇంట్లో కూడా నాకు అలాంటి ఒత్తిడి ఏది తలెత్తదు. పైగా నేను పూర్తిగా యాక్టింగ్ వదిలేయలేదు. బాలీవుడ్ అవకాశాలు కూడా వున్నాయి. వాటికి కూడా సమయం కేటాయిస్తూ మ్యూజిక్ ఆల్బమ్స్ పూర్తి చేస్తాను. కాబట్టి ఇప్పట్లో పెళ్లి ఆలోచనలు ఏమి లేవు. వయసు నాకు అడ్డుకట్ట కాదు కాబట్టి పెళ్ళికి ఎలాంటి తొందర లేదు." అని సెలవిచ్చింది శృతి హాసన్.

