’ఎంఎంఎస్ లో రాసలీల‘ సినిమా కథాంశం అంతే!

రక్త చరిత్ర, ధోని, లెజెండ్, లయన్, కబాలి తో పాటు పలు తమిళ, మళయాళ చిత్రాలతో దక్షిణ భారతీయ చాల చిత్ర ప్రేక్షకులకు సుపరిచితురాలు ఐన కథానాయిక రాధికా ఆప్టే . అయితే రాధికా ఆప్టే ప్రదర్శించే అభినయం ఉత్తరాది తో పాటు దక్షిణాదిన కూడా ఒకే తరహాలో ఉంటున్నప్పటికీ, అందాల ఆరబోత విషయంలో మాత్రం రాధికా కు ప్రాంతాల పక్షపాతం బాగానే ఉంటుంది. పార్షెడ్, మ్యాడ్ల్ వంటి చిత్రాలలో అర్ధ నగ్న ప్రదర్శనలతో పాటు హద్దులు దాటినా ఇంటిమేట్ స్కీన్స్ తో ఉత్తరాది సినీ ప్రేక్షకులకు ఊపిరి తిప్పుకోలేని పరిస్థితిని కల్పించింది. ఇప్పుడు చిత్రీకరణలో వున్న రాధికా ఆప్టే తాజా చిత్రంలోనూ ఇటువంటి బోల్డ్ సీన్స్ పుష్కలంగానే ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం రాధికా ఆప్టే బొంబారియా అనే హిందీ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం రాధికా ఫిలిం ప్రచార కర్త పాత్ర ను పోషిస్తుంది. చిత్రంలో ఒక సినిమా హీరోతో రహస్య రాసలీలలు జరిపే సందర్భాన్ని తన ఫోన్లో దాచుకున్న రాధికా ఆప్టే కు ఆ ఫోన్ చోరీ కి గురికావడంతో ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. ఆ రహస్య ఎం.ఎం.ఎస్ బైటకి రాకుండా తీసుకునే పలు చర్యలు, అసలు రాధికా ఆప్టే పాత్ర ఫోన్ ఎవరి చేతికి చేరింది? ఆ వ్యక్తి ఆ ఎం.ఎం.ఎస్ ని దుర్వినియోగ పరిచిన విధానాన్ని తెర పై చూడమంటున్నారు బొంబారియా చిత్ర బృందం.
ఇటువంటి బోల్డ్ పాత్రలకు బాలీవుడ్లో కేర్ అఫ్ అడ్రెస్స్ అయిపోయింది రాధికా ఆప్టే. ఇవి కాకుండా హాలీవుడ్ లో ది ఫీల్డ్, ది ఆశ్రమ్ అని రెండు ఆంగ్ల చిత్రాలలో నటిస్తుంది రాధికా. హిందీ లోనే ఇన్నిన్ని విడ్డూరాలు చూపిస్తున్న రాధికా ఎటువంటి పరిమితులు లేని ఆంగ్ల చిత్రాల్లో ఇంకెంత రెచ్చిపోతుందో మరి.

