Sat Dec 27 2025 19:40:04 GMT+0000 (Coordinated Universal Time)
ఊరిస్తున్న మహేష్ : ఈ పండగా..? వచ్చే పండగా?

మహేష్ విజయదశమికి తన కొత్త సినిమా టీజర్ తో నైనా లేక ఆ సినిమా టైటిల్ ని అయినా విడుదల చేస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. కానీ మహేష్ కి సంబంధించి ఒక్క టీజర్ గాని లేక టైటిల్ కి సంబంధించి ఒక్క న్యూస్ కూడా బయటికి రాలేదు. అయితే మహేష్ అభిమానులను నిరాశ పంచకుండా వచ్చే దీపావళికి తన సినిమా కి సంబంధించి ఒక టీజర్ ని విడుదల చెయ్యడానికి అన్ని సిద్ధం చేస్తున్నాడని సమాచారం. ఎందుకంటే మహేష్ సినిమా మురుగదాస్ డైరెక్షన్ లో అటు తమిళం లోను, ఇటు తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ఇక తమిళం లో దీపావళి పెద్ద పండగ కాబట్టి... అందుకే మహేష్ చిత్ర టీజర్ ని అప్పుడు విడుదల చెయ్యాలని మురుగదాస్ భావించాడట.
ఎలాగూ ఈ దసరాకి బాలకృష్ణ తన 100 వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' టీజర్ తో అభిమానులను అలరించగా.... రామ్ చరణ్ కూడా తన 'ధ్రువ' సినిమా టీజర్ తో మెగా అభిమానులను ఖుషి చేసాడు. అందుకే సందట్లో సడేమియా లా ఎందుకు అనుకున్నాడేమో మురుగదాస్ ఇలా సోలోగా రావాలని ప్లాన్ చేసాడు. ఎలాగూ తెలుగు, తమిళ్ లో దీపావళి అందరూ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అప్పుడే ఈ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి మురుగదా ప్లాన్ చేసాడన్నమాట. ఇక మహేష్ అభిమానులు ఈ దసరా పండక్కి కొద్దిగా నిరాశపడ్డా... దీపావళికి సెలెబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవయిపోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం పూర్తయిందని..... ఇక దీపావళికి రిలీజ్ చేసే టీజర్ కి సంబంధించి కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ చిత్రం లో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది.
Next Story

