ఈ హీరోలిద్దరూ పనిలో పనిగా అన్ని చక్కబెట్టేస్తున్నారు!

గత వారం రోజులుగా రాజమౌళి తో చెయ్యబోయే మల్టీస్టారర్ సినిమా వర్క్ షాప్ విషయమై రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి విదేశాలకు వెళుతున్నారని న్యూస్ మాములుగా చక్కర్లు కొట్టలేదు. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లు బుధవారం ఉదయం ఎయిర్ పోర్ట్ లో కలిసి కనబడంతో ఈ వార్తలకు బాగా బలం చేకూరింది. రాజమౌళి తో చేసే సినిమా కోసం చరణ్ అండ్ ఎన్టీఆర్ లు అమెరికాకి ఎగిరిపోతున్నారని... ఆ మల్టీస్టారర్ కోసం అక్కడ ఫోటో షూట్స్ గట్రా ఈ హీరోలు చేయించుకుంటున్నారని... ఎవరికీ తోచినట్టుగా వారు ఊహించుకుని రాసిపడేశారు,
అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరోలిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడమే పెద్ద సెన్సేషన్ అయితే... ఒకే ఫ్లీట్ ఎక్కి విదేశాలకు ఎగిరిపోయి అక్కడ కలిసి ఫోటో షూట్స్ చేయించుకోవడం మరో సెన్సేషన్. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి విదేశీ ప్రయాణంపై మరో లేటెస్ట్ న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే రామ్ చరణ్ ఇప్పటివరకు రంగస్థలం కోసం గెడ్డం పెంచేసి రఫ్ గా ఆన్నాడు... కానీ ఇప్పుడు బోయపాటి సినిమా కోసం స్టైలిష్ లుక్ లోకి మారాలి. అలాగే ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమా కోసం క్లాస్ కుర్రాడిలా మరిపోవడానికి గాను విదేశాలకు వెళ్లారని టాక్ వినబడుతుంది.
అక్కడ యుఎస్ లో ది బెస్ట్ ట్రైనర్లు సహాయంతో చరణ్ అండ్ ఎన్టీఆర్ లు తమ లుక్స్ లో మార్పులు చేర్పులు చేసుకుంటారట. మాస్ నుండి క్లాస్ లుక్ కి చరణ్.. క్లాస్ లుక్ నుండి మోడ్రెన్ లుక్ కి ఎన్టీఆర్ మారడానికి కూడా ఈ విదేశీ ట్రిప్ ఉపయోగపడమే కాదు.... అక్కడ రాజమౌళి మల్టీస్టారర్ సినిమా కి సంబందించిన పనులను పూర్తి చేస్తారట ఈ స్టార్ హీరోస్. మరి ఒకేసారి ఈ ఇద్దరు హీరోస్ రెండు పనులను చక్కబెట్టేందుకే ఒకే ఫ్లయిట్ లో బయట దేరారన్నమాట.

