ఈ హీరోయిన్ పారితోషకం తగ్గించింది

గతంలో లావణ్య త్రిపాఠికి హిట్స్ ఉన్నపటికీ ఈ ఏడాది మాత్రం ఆమెకున్న క్రేజ్ రెండు మూడు సినిమాల ప్లాప్ తో తుడిచిపెట్టుకుపోయింది. గ్లామర్ గ్లామర్ అంటూ తెగ ఇదైపోతున్న లావణ్య త్రిపాఠి ఈ మధ్యన కొన్ని ప్రాజెక్టులనుండి తప్పుకుందని ప్రచారం జరిగినప్పటికీ... అదేం లేదు అసలు ఆ ప్రాజెక్టులనుండి లావణ్యని తప్పించేసారు అనేవారు లేకపోలేదు. ప్రస్తుతానికి అందాలు ఆరబోస్తానన్నా ఎవరు పిలిచి అవకాశం ఇవ్వడం లేదు. వరుసగా పరాజయాలతో సతమతమవుతున్న లావణ్య ఇప్పుడొక డెసిషన్ కి వచ్చినట్టుగా వార్తలొస్తున్నాయి.
ఎవరైనా దర్శకనిర్మాతలు మంచి కథలుతో వస్తే.. అలాగే మంచి మంచి పాత్రలు గనక ఇస్తే తన పారితోషకాన్ని తగ్గించుకునేందుకు రెడీ అయ్యిందనే టాక్ వినబడుతుంది. అసలే అవకాశాలు రావడంలేదంటే.. అందులోను మంచి పాత్రలెలా వస్తాయి. అయితే రామ్ తో నటిస్తున్న ఉన్నది ఒకటే జిందగీలో కూడా లావణ్య త్రిపాఠి తన పారితోషకాన్ని తగ్గించుకుని 50 లక్షలు మాత్రమే తీసుకుందని టాక్ వినబడుతుంటే.. మరోపక్క వినాయక్ - సాయి ధరమ్ తేజ కలయికలో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా 50 లక్షల పారితోషకమే తీసుకుంది అంటున్నారు.
మరి కేవలం లావణ్యకి ఆఫర్స్ తగ్గడం వలెనే ఇలా పారితోషకం తగ్గించిందనే గుసగుసలు ఫిలింనగర్ లో వినబడుతున్నాయి.

