ఈ సినిమా సూపర్ హిట్ ?

మహేష్ బాబు ఇమేజ్ ని ఒక్క స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ఒక్కడు అని చెప్పుకోవొచ్చు. ఈ సినిమాలో మహేష్ నటనకు అప్పట్లో అందరు ఫిదా అయ్యిపోయారు. అందులో విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ కు కూడా మంచి పేరు వచ్చింది. ఇలా వీరి కాంబినేషన్ లో చాలానే సినిమాలు వచ్చాయి.మహేష్ మూవీస్ లో ప్రకాష్ రాజ్ పోకిరి - బాబీ - సైనికుడు - అర్జున్ లాంటి సినిమాల్లో అన్నిటిలోనూ విలన్ పాత్రలే పోషించాడు. ఒక్క సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మాత్రం ప్రిన్స్ తండ్రిగా మంచితనానికి ప్రతిరూపమైన సాఫ్ట్ రోల్ లో నటించాడు.
అయితే ఈ మధ్య కాలంలో మహేష్ మూవీస్ లో ప్రకాష్ కనిపించట్లేదు. మళ్ళి ఇప్పుడు భరత్ అనే నేనులో ఈ కాంబో రిపీట్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా హీరో పాత్ర పాత్ర చేస్తున్నాడు. మహేష్ కు ధీటుగా ప్రకాష్ రాజ్ ఇందులో ప్రతిపక్ష నాయకుడి పాత్ర చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. వీరిద్దరి మధ్య పొలిటికల్ పంచులతో సీన్స్ ని దర్శకుడు కొరటాల శివ ఓ రేంజ్ లో తీస్తున్నట్టు టాక్ వస్తోంది.
ప్రకాష్ రాజ్ పాత్ర వేసే ఎత్తులకు - కుట్రలకు మహేష్ తనదైన స్టైల్ లో తిప్పి కొట్టి ఎపిసోడ్స్ థ్రిల్ చేయటం ఖాయం అంటున్నారు. మహేష్ బాబు సినిమాల్లో ప్రకాష్ రాజ్ విల్లన్ గా చేసిన పాత్రలన్నీ సూపర్ హిట్ ఏ, కొన్ని సినిమాలు తప్ప. అయితే ఇప్పుడు మల్లి అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది కాబ్బట్టి సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుంది అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. మార్చ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.