ఈ షోతో ఆమెకి ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది!

రియాలిటీ షోస్ లో టాప్ ప్లేస్ లో బాలీవుడ్ లో సక్సెస్ అయినా బిగ్ బాస్ షోని టాలీవుడ్ కి కోలీవుడ్ కి దిగుమతి చేశారు. అక్కడ బాలీవుడ్ లో సల్మాన్ హోస్ట్ గా బిగ్ బాస్ ఇరగదీసే రేంజ్ లో సక్సెస్ అయ్యింది. మరి ఇక్కడ కోలీవుడ్ లో కమల్ హాసన్ హోస్ట్ గా తెరకెక్కుతున్న బిగ్ బోస్ షో కి తమిళంలో మొదటినుండి పాజిటివ్ టాక్ లేకుండా సాగుతుంది. ఆ షో పై ఎంత కాంట్రవర్సీ రావాలో అంత వచ్చేసింది. ఆఖరికి ఈ షో మీద కొంతమంది కోర్టు మెట్లెక్కారు కూడా. ఎంత జరిగిన బిగ్ బాస్ తమిళంలో పాపులారిటీ సంపాదించలేక చతికిలపడింది.
కానీ ఉన్నట్టుండి అనూహ్యంగా ఓవియ , ఆరవ్ ల మధ్య ప్రేమాయణం కూడా ఈ షో లో సంచలనంగా మారింది. దీనితో జనాలు ఎగబడి చూడడం ప్రారంభించారు. ఇంకేంటి తమిళ బిగ్ బాస్ షో ఒక రేంజ్ లో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఇక టిఆర్పి రేటింగ్ లు తగ్గవని అనుకున్న నిర్వాహకులకు మల్లి భారీ షాక్ తగిలింది. బిగ్ బాస్ నుంచి ఓవియా తప్పుకోవడంతో ఆమె అభిమానులు ఈ షోని చూడడం మానేశారట. దీనితో టిఆర్పి రేటింగ్ లు తగ్గు ముఖం పట్టినట్లు తెలుస్తోంది. దీనితో బిగ్ బాస్ నిర్వాహకులు డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది.
అందుకే ఓవియాని తిరిగి బిగ్ బాస్ షోకి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. గతం లో బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు ఆమెకి వారానికి 2.5 లక్షలు పారితోషకం ఇచ్చేవారు. ఈ సారి ఆమె తిరిగి మల్లి బిగ్ బాస్ షోకి వస్తే ఈసారి 5 లక్షలు ఇవ్వడానికి షో నిర్వాహకులు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంలో నిజం ఎంతో తెలియదు కానీ.. బిగ్ బాస్ దెబ్బకి ఓవియా మాత్రం పెద్ద సెలేబ్రిటిగా మారిపోయింది.

