ఈ రోజు ఓకే.. రేపట్నుంచి..?

ఎంసిఎ సినిమాకి డివైడ్ టాక్ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. అయినా వసూళ్లు మాత్రం స్టడీగా అదిరిపోయేలా రాబడుతుంది. అయితే ఎంసీఏ కి గట్టి పోటీగా ఏ సినిమా లేకపోవడం... అఖిల్ హలో యూత్ కి మాత్రమే నచ్చే సాఫ్ట్ లవ్ స్టొరీ కావడం... కొంతలో కొంత నానికి ఫేవర్ గా మారుతోంది. గురవారమే విడుదల కావడంతో క్రిస్మస్ సెలవులు కలిపి మొత్తం ఐదు రోజులు పండగ చేసుకునే అవకాశం కొట్టేసింది ఎంసీఏ సినిమా.
అయితే ఎంసీఏ కలెక్షన్స్ ఫస్ట్ డే తో కంపేర్ చేస్తే జోరు కాస్త తగ్గింది అనిపించింది. ఎందుకంటే అఖిల్ హలో, సల్మాన్ టైగర్ జిందా హై సినిమాలు ఎఫెక్ట్ ఎంసీఏ కలెక్షన్స్ మీద ప్రభావం చూపించాయి. ఇక కలెక్షన్ చూసుకుంటే ఎంసిఎ 30 కోట్ల గ్రాస్ మార్క్ కు అతి దగ్గరలో ఉంది. ఇందులో షేర్ రూపంలో 18 కోట్ల దాకా నాని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎలా చూసుకున్నా ఇది మంచి మొత్తమే. వెనక్కు తీసుకురావాల్సింది ఇంకా చాలానే ఉన్నప్పటికీ డివైడ్ టాక్ వచ్చిన మూవీకి ఇది పెద్ద మొత్తమే.
అయితే ఈ రోజు సోమవారం క్రిష్ట్మస్ సెలవు కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. ఈ కలెక్షన్స్ జోరు ఇంకా కొనసాగవచ్చు. అసలు పరీక్ష రేపటి నుంచి అంటే మంగళవారం నుంచి మొదలవుతుంది. డ్రాప్ ఉండటం సహజమే అయినప్పటికీ అది ఎంత తీవ్రంగా ఉంటుంది అనే దాని బట్టి ఎంసిఎ కొన్నవాళ్ళు సేఫ్ అవునా కాదా అనేది తేలుతుంది. దిల్ రాజు మాత్రం ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది అన్న ఆనందంలో 2017 స్పెషల్ ఫంక్షన్ ఈ రోజు సోమవారం సాయంతం 7 గంటలకు హైదరాబాద్ లోని పార్క్ హైయ్యత్ లో ఘనంగా నిర్వహించబోతున్నాడు

