Tue Mar 31 2026 03:48:55 GMT+0530 (India Standard Time)
ఈ యంగ్ హీరోయిన్స్ లో ఒక్కరు రవి తేజ నెక్స్ట్ మూవీలో

తన సినిమాల్లో కొత్త యంగ్ హీరోయిన్స్ ని తీసుకోవడం రవి తేజకి అలవాటే. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తున్నాడు రవి. కళ్యాణ్ కృష్ణ తో చేస్తున్న నెక్స్ట్ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నాడు. ఒక్కరు రకుల్ ప్రీత్ సింగ్ ఇంకొక్కరు లావణ్య త్రిపాఠి. అయితే రవి తేజ ఆల్రెడీ రకుల్ తో ఒక సినిమా చేసాడు. కానీ లావణ్య తో ఫ్రెష్ కాంబినేషన్.
కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాని రవి తేజ ధృవీకరించాడు. అటు కల్యాణ్ కృష్ణ మాత్రం ఈ ఇద్దరు హీరోయిన్లతో వర్క్ చేశాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో లావణ్య త్రిపాఠి, రారండోయ్ వేడుక చూద్దాంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. మరోసారి వీరిద్దరిలో ఒక్కరిని రిపీట్ చేయనున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా ఈ నెలాఖరు నుండి ప్రారంభమౌతుంది. అప్పటికి హీరోయిన్లపై ఓ క్లారిటీ వస్తుంది.
Next Story

