ఈసారి 2019 సంక్రాంతికి బిగ్ ఫైటే!

2018 సంక్రాతి వచ్చింది వెళ్ళింది. ఈసారి సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఢమాల్ అయ్యాయి. ఇక మిగిలింది వచ్చే సంక్రాతి. ఇప్పటినుండే 2019 సంక్రాతి కి ఏ సినిమాలు వస్తాయా అనేది కేవలం ప్రేక్షకుడు మాత్రమే కాదు.. ఆ డేట్ ని వదులుకోవడానికి నిర్మతలెవరు సిద్ధంగా లేరు. అయితే ఇప్పుడు తాజాగా 2019 సంక్రాంతికి బిగ్ ఫైట్ జరగబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఆ ఫైట్ అలాంటి ఇలాంటి ఫైట్ కాదు. ఏకంగా ఫుల్ ఫామ్ లో ఉన్న ముగ్గురు స్టార్ హీరోలు సంక్రాంతికి దిగుతున్నారని న్యూస్ అభిమానులను వెర్రెక్కిస్తుంది.
ఆ హీరోలెవరంటే సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ - శ్రద్ద కపూర్ లు జంటగా తెరకెక్కుతున్న సాహో చిత్రం కొన్ని అనివార్య కారణాల వలన దసరాకి రావాల్సింది కాస్తా సంక్రాంతికి విడుదల చేసే యోచనలో యూవీ క్రియేషన్స్ వారు ఉన్నారు. షూటింగ్ లెట్ అవడం.. అలాగే గ్రాఫిక్స్ పనులు లేట్ అవడంతో సాహో ఇలా సంక్రాతి బరిలోకి వచ్చింది. అలాగే మహేష్ బాబు, వంశి పైడిపల్లి కలయికలో వస్తున్న మహేష్ 25 సినిమా కూడా సంక్రాంతికే విడుదల చెయ్యాలని ఆ సినిమా నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ లు డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. ఎలాగూ దిల్ రాజుకి సంక్రాంతి బాగా కలిసొస్తుంది. అందుకే ఇలా మహేష్ సినిమాని సంక్రాతి బరిలో దింపుతున్నారనే టాక్ వినబడుతుంది.
ఇక మూడో స్టార్ ఎవరంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్. త్రివిక్రమ్ దర్శకత్వలో ఎన్టీఆర్ నటించబోయే సినిమాని కూడా పకడ్బందీగా తెరకెక్కించి సంక్రాంతిని క్యాష్ చేసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారనే టాక్ వినబడుతుంది. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. మామూలుగానే త్రివిక్రమ్ తన సినిమాలను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. అందుకే త్రివిక్రమ్ సినిమాని తెరకెక్కించి సంక్రాతి బరిలో నిలుపుతాడంటున్నారు. మరి నిజంగా ఇదంతా నిజమే అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ పోటీ తప్పేలా లేదు.