ఈసారి గ్రాండ్ గా చేస్తుందట

నాగ చైతన్య మిత భాషి. అంతేకాదు తనేం చేసిన ఇతరులకు తెలియడం అనేది పెద్దగా ఇష్టం ఉండదు. కానీ చైతు భార్య సమంత మాత్రం తనకు సంబందించిన ప్రతి విషయాన్నీ నలుగురితో షేర్ చేసుకోవాలనుకుంటుంది. సమంత లో నచ్చని గుణం అదేనని నాగ చైతన్య పెళ్ళికి ముందే చెప్పాడు. కానీ సమంత మాత్రం చైతు చెప్పిన విషయాన్నీ లైట్ తీసుకుని తాను మాత్రం తన పని చేసుకుపోతుంది. ఈ విషయంలో చైతు కూడా కాంప్రమైజ్ అయ్యాడు అది వేరే విషయం. ఇకపోతే నాగ చైతన్య తన పుట్టిన రోజును ఎప్పుడూ చాలా సింపుల్ గా కానిచ్చేస్తాడు.
కానీ ఇప్పుడు మాత్రం చైతు బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చెయ్యబోతుందట సమంత. పెళ్లి తర్వాత చేసుకునే మొదటి పుట్టినరోజు ని నాగ చైతన్య లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునే విధంగా సెలెబ్రేట్ చెయ్యడానికి అన్ని సిద్ధం చెయ్యడమే కాదు నాగ చైతన్యకి ఒక సర్ప్రైజ్ ని కూడా ప్లాన్ చేసిందట సామ్. అయితే చైతు పుట్టినరోజుని పెళ్లిలాగా డెస్టినేషన్ బర్త్ డే గా జరపాలనుకుందట. కానీ షూటింగ్స్ తో ఉన్న బిజీ కారణంగా సమంత ఇక్కడే హైదరాబాద్ లోనే నాగ చైతన్య పుట్టిన రోజు వేడుకని నిర్వహిస్తుంది.
అటు నాగ చైతన్య సవ్యసాచి షూటింగ్ తో బిజీగా ఉండగా.. సమంత అయితే ఏకంగా మూడు నాలుగు సినిమాల్తో బిజీగా వుంది. తెలుగులో మహానటి, రంగస్థలం, తమిళంలో... విశాల్ అభిమన్యుడు, విజయ్ సేతుపతి సరసన మరో సినిమాలోనూ నటిస్తుంది. ఈ కారణంగానే బయట పుట్టిన రోజు జరుపుకోవడం కుదరక ఇక్కడ హైదరాబాద్ లోనే ప్లాన్ చేసిందట. రేపు గురువారం ఒక్క రోజు షూటింగ్ కి సెలవ్ పెట్టేసి నాగ చైతన్య బర్త్ డే సెలెబ్రేషన్స్ ని ప్లాన్ చేసిందట సమంత. మరి ఆ సెలెబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనే విషయం మనకు చెప్పేస్తుందిలెండి. ఎలాగూ సమంత సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. సో.. అలాగే మనకు తెలిసిపోతుంది అన్నమాట.

