ఈసారి కూడా కొడతారా..?

'సింహ, లెజెండ్ 'వంటి సూపర్ హిట్స్ చిత్రాలతో బాలకృష్ణకి జీవితంలో గుర్తుండిపోయే హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి, ఎప్పటినుండో బాలకృష్ణ తో మరో సినిమా చేసి హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నాడు. కానీ అది మాత్రం కుదరడంలేదు. అసలు ముందు బాలయ్య 100 వ చిత్రానికే బోయపాటి డైరెక్టర్ గా అనుకున్నప్పటికి సరైన స్క్రిప్ట్ లేక బోయపాటిని పక్కన పెట్టి 'గౌతమీపుత్ర శాతకర్ణి'ని డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో చేసి హిట్ కొట్టిన బాలయ్య కనీసం 101 వ చిత్రనైనా బోయపాటికి ఛాన్స్ ఇస్తాడేమో అని అనుకున్నారు.
కానీ బాలకృష్ణ, బోయపాటికి సడన్ షాక్ ఇస్తూ పూరి డైరెక్టన్ లో 'పైసా వసూల్' స్టార్ట్ చేసాడు. ఇక 102 అయినా బోయపాటికి దక్కుతుంది అనుకుంటే దాన్ని కూడా కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో స్టార్ట్ చేసాడు బాలయ్య. ఇక బోయపాటి కూడా బాలయ్య కోసమే వెయిట్ చెయ్యకుండా బెల్లంకొండ శ్రీనివాస్ తో 'జయ జానకి నాయక' చేస్తున్నాడు. అయితే ఇప్పుడు బాలకృష్ణ, కె. ఎస్ రవికుమార్ చౌదరి చిత్రం పూర్తి కాగానే బోయపాటి డైరెక్షన్ లో బాలయ్యని నటింపచేసేందుకు ఇద్దరు ముగ్గరు నిర్మాతలు ట్రై చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
కె ఎస్ రవికుమార్ సినిమాని మూడు నాలుగు నెలల్లో పూర్తి చేసేసి బాలకృష్ణ కూడా బోయపాటి సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడని... అందుకే బోయపాటిని మంచి స్క్రిప్ట్ తో రెడీగా ఉండమని చెప్పినట్లు కూడా చెబుతున్నారు

