ఈసారి అభిమానులకి పండగే!!

మహేష్ అభిమానులు 'స్పైడర్' లో మహేష్ ఎలా వుండబోతున్నాడు అని ఫస్ట్ లుక్ బయటికి వచ్చేవరకు నానా హంగామా చేశారు. ఇక మహేష్ అభిమానులు అనడం కాదు గాని 'స్పైడర్' డైరెక్టర్ మురుగదాస్ కూడా మహేష్ లుక్ ని బయటికి వదలడానికి తెగ తాత్సారం చేసాడు. ఇక టీజర్ విషయంలో సేమ్ సీన్ రిపీట్ అవడంతో మహేష్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. కానీ టీజర్ లో మహేష్ ని చూడగానే శాంతించారు. ఇక సినిమాని జూన్ 23 విడుదల చేస్తున్నట్లు 'స్పైడర్' సినిమా సెట్స్ మీదకెళ్లాక చెప్పారు. కానీ అది కూడా డిలే అయ్యి దసరాకి వెళ్ళిపోయింది. అయితే 'స్పైడర్' టీజర్ లో కేవలం గ్రాఫిక్స్ తో కూడిన స్పైడర్ ని చూపిస్తూ మహేష్ లుక్ ని రివీల్ చేశారు గాని సినిమా కథ ఏమిటనేది మాత్రం క్లారిటీ లేకుండా చేశారు.
ఇక ఆ టీజర్ విడుదలయ్యాక మరో టీజర్ ని 'స్పైడర్' టీమ్ విడుదల చెయ్యబోతుందంటూ తెగ ప్రచారం జరిగింది కానీ ఎక్కడా చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా చెప్పలేదు. అయితే ఇప్పుడు మాత్రం 'స్పైడర్' షూటింగ్ ఒక పాట మినహా పూర్తవడంతో చడీ చప్పుడు కాకుండా మహేష్ సాఫ్ట్ లుక్ తో ఉన్న ఫొటోస్ ని మీడియాకి వదిలారు. ఈ ఫొటోస్ లో మహేష్ బాబు అబ్బాబ్బా... ఏమున్నాడ్రా అనిపిస్తుంది. అంత అందంగా ఉన్నాడు ఆ లుక్ లో మహేష్. ఇక మహేష్ లుక్ చూసి మహేష్ అభిమానులు మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు. ఇక ఇప్పటికే తెలుగు, తమిళంలో బిజినెస్ ఊహించిన దానికంటే జరగడంతో మేకర్స్ కూడా ఫుల్‌జోష్‌లో వున్నారు.
ఒక లుక్ తోనే మహేష్ అభిమానులు ఇలా హ్యాపీ గా ఫీల్ అవుతుంటే ఇప్పుడు 'స్పైడర్' మరో టీజర్ విడుదలకు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందట. ఈసారి టీజర్ లో అసలు సిసలైన మహేష్ 'స్పైడర్' లో ఎలా వుండబోతున్నాడో... తెలిసిపోతుందట. ఇక ఈ టీజర్ కి ముహూర్తం కూడా సెట్ చేశారట. ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇక 'స్పైడర్' సెప్టెంబర్ 27 న దసరా కానుకగా విడుదల కాబోతుంది.

