ఈవిడ గారు మళ్ళీ కెలకడం స్టార్ట్ చేసింది.!!

కె రాఘవేంద్ర రావు పై తాప్సి బాలీవుడ్ లో ఒక ఇంటర్వ్యూ లో వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం దానికి టాలీవుడ్ తాప్సిపై దుమ్మెత్తిపోయ్యడం.... దెబ్బకి దెయ్యం దిగి తాప్సి రాఘవేంద్ర రావు కి క్షమాపణలు చెప్పడం కూడా జరిగిపోయాయి. అయితే అమ్మడు మాత్రం దిగొచ్చి క్షమాపణ చెప్పినట్టు లేదని... తన అప్ కమింగ్ సినిమా కోసమే తాప్సి ఇలా క్షమాపణ చెప్పిందని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ఈ వివాదాన్ని తాప్సి మరలా కావాలని కెలుక్కుంటుందని అంటున్నారు.
ఆమె రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఘవేంద్ర రావు గారిని కించపరిచినట్లు మీడియాలో చూపెట్టిందంతా అబద్దమని.... తనసలు అలా ఏం అనలేదని మీడియానే కావాలని తన మాటలను వక్రీకరించినట్లు చెబుతుంది. అసలు నేను నా మొదటి డైరెక్టర్ రాఘవేంస్ర రావు గారి గురించి అలా ఎందుకు మాట్లాడతా... అసలు నేనేం మాట్లాడానని మీడియాలో నాపై అటువంటి కథనాలు ప్రచారం చేశారు.... కొన్ని సెకన్ల వీడియో చూసే నన్ను విమర్శించేస్తారా...? అసలు మీరు ఆ 15 నిమిషాల నిడివిగల వీడియో ని పూర్తిగా చూసారా? అంటూ మీడియాపై చిందులు వేస్తుంది.
అయితే రాఘవేంద్ర రావు గారితో పనిచేసిన హీరోయిన్స్ అంతా తమని ఆయన చాలా అందంగా చూపెట్టారని... తమ బొడ్డుపై అలా పూలు పళ్ళు విసిరి అక్కడ బొద్దు మీద కూడా మంచి గ్లామర్ ఉంటుందని నిరూపించాడని... చెబుతున్నారు. కానీ తాప్సినేమో.... నాకు అప్పట్లో గ్లామర్ గురించి తెలియదు. అందుకే అలా అన్నా అంటూ మళ్ళీ రచ్చకి శ్రీకారం చుడుతోంది. అయిందేదో అయ్యింది. సారీ చెప్పి సమస్యని సామరస్యంగా పరిష్కరించుకుంది అనుకున్నాక మళ్ళీ ఇలా కావాలని కెలుక్కుని రచ్చ చెయ్యడం అవసరమా తాప్సి అంటున్నారు టాలీవుడ్ పెద్దలు.

