ఇప్పుడు పర్వాలేదు తల్లి

పవన్ పక్కన గబ్బర్ సింగ్ లో నటించిన శృతి హాసన్ కి ఆ సినిమా ఫుల్ ఫెమ్ తీసుకొచ్చి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. అదే పవన్ కళ్యాణ్ పక్కన కాటమరాయుడు లో నటించి ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకుంది. కాటమరాయుడు చిత్రంలో శృతి హాసన్ బొద్దుగా ఎబ్బెట్టుగా కనబడడం వలెనే సగం సినిమా పోయిందన్నారు పవన్ ఫాన్స్. కేవలం పవన్ ఫాన్స్ మాత్రమే కాదు అందరూ శృతి హాసన్ నే బ్లేమ్ చేశారు. ఇక ఆ తర్వాత శృతి హాసన్ మరో ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు అనేకంటే ఇప్పటివరకు ఆమెకు అవకాశాలు తలుపు తట్టలేదంటే బావుంటుంది. అయితే మంచి ఫామ్ లో ఉన్న శృతి హాసన్ ఫిట్ నెస్ గురించి పట్టించుకోక పోవడంతో సినిమాల నుండి సైడ్ కావాల్సి రావడం.. అలాగే సుందర్ సి దర్శకత్వంలో సంఘమిత్ర చిత్రంలో నటించాల్సిన శృతి ఆ ప్రాజెక్ట్ నుండి అర్ధాంతరంగా తప్పుకోవడం వంటి విషయాలు శృతి హాసన్ కెరీర్ కి మైనస్ అయ్యాయి.
ఇకపోతే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే శృతి హాసన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా ఉండడం లేదు. అలాగే తన పిక్స్ ని కొన్ని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నా... వాటితో ఎవరిని పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. ఇక శృతి హాసన్ పని అయిపోయింది అనుకునేలోపే ఇపుడు తాజాగా బాలీవుడ్ ఒక ఈవెంట్ లో మెరిసింది. అక్కడ రెడ్ డ్రెస్ లో శృతి అందాల ఆరబోత చూస్తుంటే అమ్మడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేలాగే కనబడుతుంది. మరి ఈ ఫోటోలలో శృతి హాసన్ మళ్ళీ తన ఫామ్ కొనసాగించడానికి సిద్దమయినట్లే అనిపిస్తుంది.
అయితే బాడీ పరంగా శృతి హాసన్ ఫిట్ గా కనిపిస్తున్నప్పటికీ మోహంలో మాత్రం ఇదివరకటి గ్లో మిస్ అయ్యింది. మరి శృతి హాసన్ ఈ హాట్ అందాల ఆరబోత చూస్తుంటే మాత్రం అవకాశాలు కోసం ఎదురు చూస్తున్నట్లే అనిపిస్తుంది. చూద్దాం శృతి అందాలకు ఎవరు పడతారో.


