ఇప్పుడు ఈ ఇద్దరి చుట్టూనే సినిమా ఇండస్ట్రీ పడుతోందా

ఒకప్పుడు హీరోయిన్స్ అందానికి, అభినయానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు. ఎక్కువగా గ్లామర్ ని ఆరబొయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. అయినా చాలాకాలం వారు ఇండస్ట్రీలో కొనసాగారంటే కారణం వారి నటన. మరి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న హీరోయిన్స్ మాత్రం నటనకన్నా ఎక్కువగా గ్లామర్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేలా ఉంటున్నాయి సినిమాల్లో వారి కేరెక్టర్స్. గ్లామర్ ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్లకి గ్లామర్ షో చేయడం తప్ప పర్ఫార్మ్ చేయడానికి ఏం వుండదనేది కామన్ ఒపీనియన్ అయిపొయింది ఇప్పుడు. గ్లామర్ షో చెయ్యని భామలకు మళ్ళీ అవకాశాలు వస్తాయంటే నమ్మకం లేకుండా పోయింది. అందుకే హీరోయిన్స్ కూడా ఇలా అందాల ఆరబోతకు దిగిపోతున్నారు.
కానీ గ్లామర్ కన్నా నటనకు ఇంపార్టెన్స్ ఇచ్చే నటీమణుల్లో మనకు ఈ మధ్యకాలంలో నిత్య మీనన్ కనబడుతుంది. ఆమె ఎక్కువగా నటనకు ప్రాధాన్య ఉన్న సినిమాల్లోనే నటిస్తూ కెరీర్లో ముందుకు పోయింది. అలాగే కీర్తి సురేష్ కూడా గ్లామర్ కి దూరంగా ఉంటూనే హిట్స్ కొడుతూ అవకాశాలు అందుకుంటుంది. తాజాగా నిత్య, కీర్తి కోవలోకి మరో ఇద్దరు భామలు చేరారు. వారే 'జంటిల్మన్' తో టాలీవడ్ కి పరిచయమైనా నివేత థామస్, 'ఫిదా' సినిమాతో మతులుపోగొట్టిన సాయి పల్లవులు. వీరిద్దరూ గ్లామర్ కన్నా నటనకు ప్రాధాన్యం ఇస్తూ అందచందాలు ఆరబొయ్యకపోయినా మంచి నటనతో అవకాశాలు కొట్టెయ్యొచ్చని నిరూపిస్తున్నారు. నాని తోకలిసి నటించిన 'నిన్ను కోరి' హిట్ చిత్రంలో నానినే మించిపోయేలా పర్ఫార్మ్ చేసిందంటూ నివేతను అందరూ మెచ్చుకున్నారు.
ఇక సాయి పల్లవి అయితే ' ఫిదా ' మూవీతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. 'ఫిదా' మూవీకి ఈ రేంజ్ కలెక్షన్లు వస్తున్నాయంటే అదంతా సాయి పల్లవి చేసిన మాయే అంటున్నారు. మరి వీరిద్దరూ గ్లామర్ ని పక్కన పెట్టి ఇలా నటనకు ప్రాధాన్యత ఇస్తూ ఇండస్ట్రీలో ఎంత కాలం నెట్టుకొస్తారో గాని ఇప్పుడు మాత్రం వీరిద్దరిని తమ తమ సినిమాలో బుక్ చేసుకోవడానికి దర్శక నిర్మాతలు మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ముందు నివేధాకి సాయి పల్లవికి మధ్య టఫ్ వార్ నడిచే అవకాశం వుందంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతున్నాయి కూడా...!

