ఇప్పట్లో హీరోగా చెయ్యడేమో?

అక్కినేని నాగార్జున ప్రస్తుతానికి హీరోగా సినిమాలేమి ఒప్పుకోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు. ప్రస్తుతానికి నాగ్ హీరోగా 'రాజు గారి గది 2 ' తప్ప సెట్స్ మీద ఇంకేం సినిమాలు లేవు. తన దగ్గరికి కథలతో వస్తున్న డైరెక్టర్స్ కి నో చెబుతున్న నాగార్జున... ఇప్పుడు తాను హీరోగా చేస్తూ బిజీ అవడం కన్నా తన కొడుకుల కెరీర్ ని చక్కబెట్టడం ముఖ్యం అని చెబుతున్నాడనే టాక్ బయటికి వచ్చింది. నాగ చైతన్య, సమంతల పెళ్లి డేట్ దగ్గర పడడంతో ఆ పెళ్లి పనుల్లో బిజీగా ఉండడమే కాకుండా అఖిల్ రెండో సినిమాకి నాగార్జున నిర్మాతగా కూడా.
అసలే మొదటి సినిమా డిజాస్టర్ తో బోరుమన్న అఖిల్ కి రెండో సినిమాతో అయినా హిట్ ఇవ్వాలనే కసితో నాగార్జున ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అఖిల్ రెండో సినిమా 'హలో' ని ఎలాగైనా హిట్ చెయ్యాలని నాగ్ భావించబట్టే తాను హీరోగా మరో సినిమాకి కమిట్ అవ్వలేకపోతున్నాడట. తాను మళ్ళీ హీరోగా మరో మూవీ మొదలెడితే తన ధ్యాసంతా ఆ సినిమా మీదే ఉండి.... అఖిల్ సినిమా ని నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతోనే నాగ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ 'హలో' చిత్ర బాధ్యతలను నాగ్ దగ్గరుండి చూసుకుంటున్నాడట.
ఇక అఖిల్ 'హలో' సినిమా డిసెంబర్ లో విడుదల అయ్యే వరకు నాగ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించే తీరిక లేదని చెబుతున్నారు. ఇక అఖిల్ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న నాగ్ ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఈ చిత్రానికి ప్రమోషన్ కూడా కొత్తగా చేస్తూ బాగా ఆకట్టుకుంటున్నాడు. మొన్నటికి మొన్న అఖిల్ ఫస్ట్ లుక్, టైటిల్ విషయంలో సోషల్ మీడియా వేదికగా కొత్తగా ట్రై చేసి జనాలను ఆకర్షించిన నాగ్ ఈ సినిమా ప్రమోషన్ ని కూడా కొత్త తరహాలోనే ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా గనక సక్సెస్ అవ్వకపోతే అఖిల్ భవిషత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉండబట్టే నాగ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడని... ఈసారి అఖిల్ రెండో సినిమాని ఖచ్చితంగా హిట్ చేసే పనిలో నాగ్ నిమగ్నమై ఉన్నాడంటున్నారు.

