ఇప్పటికి తయారైంది ఈ భామ

టాలీవుడ్ లో శ్రీయా శరణ్ సీనియర్ హీరోలతోపాటు యంగ్ హీరోలందరితో ఆల్మోస్ట్ జోడి కట్టింది. దాదాపు దశాబ్ద కాలంపాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. కానీ గత రెండేళ్లలో శ్రియ శరణ్ హావా టాలీవుడ్ లో తగ్గుమొహం పట్టింది. అయితే అనుకోకుండా శ్రియ కి బాలకృష్ణ 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో హీరోయిన్ కేరెక్టర్ ఇవ్వడమే కాకుండా తన 101 మూవీ 'పైసా వసూల్' లో కూడా హీరోయిన్ కేరెక్టర్ ఇచ్చాడు. అయితే 'పైసా వసూల్' ప్రమోషన్స్ లో హుషారుగా పాల్గొంటున్న శ్రియని మీ పెళ్ళెప్పుడు అని ప్రశ్నించగా. దానికి శ్రియ ఎలాంటి సమాధానం చెప్పిందో మీరే చూడండి.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా జరగాల్సిన వేడుక అని... అయితే నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది. నాకు అన్నివిధాలా సరిపోయే వాడిని పెళ్లిచేసుకుంటా అని సమాధానం చెప్పింది. ఇక శ్రియ అలా చెప్పిందో లేదో ఇలా శ్రియ పెళ్ళికి తయారైందనే న్యూస్ సోషల్ మీదకిలో అభిమానులు స్ప్రెడ్ చేసి పడేసారు. యోగాతో ఎప్పటికప్పుడు ఫిజిక్ ని కాపాడుకుంటానని చెప్పిన శ్రియ 'పైసా వసూల్' పై చాలా నమ్మకమే పెట్టుకుంది.