ఇద్దరూ.. స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడుతున్నారు!

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం మెహ్రీన్ కౌర్, అను ఇమ్మాన్యువల్ గురించే మాట్లాడుకుంటున్నారు. మెహ్రీన్ క్యూట్ లుక్స్ తో చంపేస్తుంటే... అను ఇమ్మాన్యువల్ మాత్రం హాట్ లుక్స్ తో చంపేస్తుంది. మెహ్రీన్ వసరుస హిట్స్ తో దూసుకుపోతుంది... కాకపోతే రాజా ది గ్రేట్ సినిమా కాస్త బొద్దుగా ఉందనే కామెంట్స్ పడ్డాయి. తాజాగా సందీప్ కిషన్ తో అంటించిన కేరాఫ్ సూర్య కూడా నవంబర్ 10 నే విడుదల కాబోతుంది. మరి మహానుభావుడు, రాజా ది గ్రేట్, కేరాఫ్ సూర్య లతో వారసబెట్టుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.
మరొపక్కన అను ఇమ్మాన్యువల్ నటించిన ఆక్సీజెన్ కూడా రేపో మాపో విడుదల కాబోతుంది. అలాగే స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమా కూడా నవంబర్ 10 న విడుదల డేట్ ఫిక్స్ చేసుకుంది. అజ్ఞాతవాసి అనే టైటిల్ ఈ సినిమాకి పెడుతున్నట్లుగా సమాచారం. అలాగే అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సూర్య సినిమాలో నటిస్తుంది. ఆసినిమా కూడా ఏప్రిల్ 27 న విడుదలకు డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మెహ్రీన్ పేరు, అను ఇమ్మాన్యువల్ పేర్లు ఇండస్ట్రీలో గట్టిగా వినబడుతున్నాయి.
అసలు అను ఇమ్మాన్యువల్ అయితే చాలా ట్రెడిషనల్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హాట్ హీరోయిన్ గా పేరు కొట్టేస్తుంది. మొదటి సినిమా మజ్నులో ఓకె.. ఓకే గా ఉన్న అను ఇమ్మాన్యువల్ ఇప్పుడు మాత్రం హాట్ అండ్ కూల్ లుక్ తో కనబడుతూ మెస్మరైజ్ చేస్తుంది. వచ్చిన వెంటనే స్టార్ హీరోలపక్కన ఛాన్స్ లు కొట్టేస్తూ లక్కీ హీరోయిన్ అయ్యింది. మెహ్రీన్ కౌర్, అను ఇమ్మాన్యూల్ లు ఇద్దరూ ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కి గట్టిగా పోటీకి వచ్చేలా కాబడుతున్నారు

