ఇదైనా ఫైనలేనా?

గత మూడు నెలల్లో తమిళంలో లో సుందర్ సి దర్శకత్వంలో మొదలు కాబోయే సంఘమిత్ర క్రేజీ ప్రాజెక్టు మీద వచ్చినన్ని వార్తలు మరే ఇతర సినిమాల మీద రాలేదు. అసలా సినిమా మొదలు కాకముందే ఆ సినిమా గురించిన పబ్లిసిటీ ఒక రేంజ్ లో జరిగింది. ఇక శృతిహాసన్ ముఖ్య పాత్రగా మొదలైన ఈ సినిమా అనేక నాటకీయపరిణామాల మధ్య ఫుల్ స్టాప్ పడిపోయింది. శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి అనేకమంది హీరోయిన్స్ పేర్లు వచ్చి చేరాయి. ఆ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ లో అనుష్క, దీపికా, నీతూ శర్మ, హన్సిక అంటూ ఇలా చాలానే పేర్లు వినబడ్డాయి... కానీ ఏది ఫైనల్ అవ్వలేదు. ఇక సంఘమిత్ర కి సంబందించిన వార్తలు కూడా మీడియాలో రావడం అరుదైపోయింది.
అయితే ఇప్పుడు తాజాగా సంఘమిత్ర సినిమాలో ముఖ్య పాత్ర పోషించే హీరోయిన్ దొరికేసింది అంటున్నారు.. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించే అవకాశం దిశా పటానీని వరించింది అంటున్నారు. బాలీవుడ్ లో ఓ మోస్తరు పేరుతెచ్చుకున్న ఈ హీరోయిన్ తెలుగుజనాలకు కూడా పరిచయమే. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా పూరి దర్శకత్వంలో లోఫర్ లో నటించిన హీరోయిన్. ఇప్పుడు సంఘమిత్ర ప్రాజెక్టుతో మరోసారి దక్షిణాది సినిమాలో కనబడనుంది. 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబోతున్నఈ సినిమా కోసం ఇంతకుముందు శృతిహాసన్, లండన్ లో ట్రయినింగ్ కూడా తీసుకుంది. కానీ తర్వాత స్క్రిప్ట్ లో వచ్చిన ఇబ్బందుల వల్ల ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.
ఇక దర్శకుడు సుందర్ సి చెప్పే కథ ప్రకారం చాలా కాల్షీట్లు కావాలి. అందుకే బాలీవుడ్ లోకాస్త ఖాళీగా ఉన్న దిశాను ఎంపిక చేశారట. సుందర్ సి. దర్శకత్వంలో తేనాండాళ్ ఫిలిమ్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి రాబోతోందని సమాచారం అందుతుంది.

