ఇది కూడా కాపీ యేనా?

ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశి ని దర్శకుడిగా పరిచయం చేస్తానని మాట ఇచ్చి కథ సిద్ధం చేపించి తరువాత మాట తప్పిన తారక్ వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ అయిపోయాడు. వక్కంతం వంశి మాత్రం ఆ కథతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కలిసి సినిమా సెట్ చేసుకుని చిత్రీకరణ దాదాపు తుది దశకి తీసుకువచ్చాడు. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్ర ఫస్ట్ ఇంపాక్ట్ చూసిన వీక్షకులు ఈ చిత్ర కథాంశం పై ఒక అంచనాకి వచ్చి ఈ చిత్ర మూల కథ వంశి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో కూడా చెప్పేస్తున్నారు.
2002 లో హాలీవుడ్ లో ఫైండింగ్ ఫిష్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన యాంతౌన్ ఫిషర్ అనే ఆంగ్ల చిత్ర కథనే వక్కంతం వంశి తెలుగు తెరకి తగిన మార్పులు చేర్పులతో బన్నీ ని ఒప్పించి సినిమా చేసేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే హీరోకి యాంగర్ మేనేజ్మెంట్ విషయమై ఎదురయ్యే సమస్యలనే కథలో కీలకంగా మార్చిన వక్కంతం వంశి క్రియేటివిటీ లో నాణ్యత ఎంతో నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా విడుదలైతే కానీ చెప్పలేం. పనిలో పనిగా కాపీ కాట్ విషయమై కూడా క్లారిటీ వస్తుంది చిత్రం విడుదలైతే.
