ఇది ఎన్టీఆర్ కున్న క్రేజ్

ఈ ఏడాది జై లవ కుశ సినిమా తో కమర్షియల్ హిట్ ని తన ఖాతా లో వేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో ఎన్టీఆర్ తన మార్కెట్ ని మరింతగా పెంచుకున్నాడు. అయితే జై లవ కుశ సినిమా షూటింగ్ తో పాటు మొదటిసారి బుల్లితెర మీద బిగ్ బాస్ తెలుగు షో కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ షో లో తనదైన కామెడీ టైమింగ్, హ్యూమర్ తో జనాలని ఎంటర్టైన్ చేయడంలో నూటికి నూరు శాతం మార్కులు కొట్టేశాడు.
అసలు ఎన్టీఆర్ వల్లే బిగ్ బాస్ షో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని ప్రేక్షకులు చాలా మంది యునానమస్ గా చేబుతున్న మాట. మొదటి ఎపిసోడ్ దగ్గర నుంచి చివరి వరకు ఆ షో కారణంగా మాటీవీ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో మరో అరుదైన రికార్డ్ ని సృష్టించింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం 2017లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ 10 షోలలో బిగ్ బాస్ తెలుగు 6వ స్థానం దక్కించుకుంది.
హాలీవుడ్ షోలకి పోటీగా టాప్ 10లో స్థానం సాధించిందంటే మామూలు విషయం కాదు. మరి గతంలో బుల్లితెర మీద ఒక తెలుగు రియాలిటీ షో ఇలాంటి అద్భుతం సృష్టించినట్టు ఎక్కడా లేదు. తొలిసారి ఈ రికార్డ్ సాధించడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ కున్న క్రేజ్ అని బిగ్ బాస్ షో మేకర్స్ భావిస్తున్నారు.

